Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దీపక్ చౌదరి అఫ్ సెట్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై…

దీపక్ చౌదరి అఫ్ సెట్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై…
-జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ
-క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
-రాజకీయాలు తన మనస్తత్వానికి సరిపోవని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం వర్కింగ్ ప్రసిడెంట్ ,మాజీ కార్పొరేటర్ నాగళ్ళ దీపక్ చౌదరి తన పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో … డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన నాగళ్ళ దీపక్ చౌదరి ఆఫ్ సెట్ అయ్యారు. ముందు ఆయన గెలిచినట్లు ప్రకటించారు.తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా ఓటమి చెందారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచినా 10 మంది కార్పొరేటర్లతో ముగ్గురు మినహా మిగతా ఏడుగురు అధికార టీఆర్ యస్ పార్టీ లో చేరారు. ఆముగ్గురిలో దీపక్ చౌదరి ,వడ్డెబోయిన నరసింహారావు ,యర్రం బాలగంగాధర తిలక్ ఉన్నారు. ముగ్గురే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాణి కౌన్సిల్లో వినిపించారు.డివిజన్లో ప్రజల మధ్య నిత్యం తిరిగి మంచి పేరు తెచ్చుకున్నారు. కాని మంత్రి పువ్వాడ అజయ్ తన డివిజన్లో పర్యటన సందర్భంగా తనకు సమాచారం లేకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆయన వాహనానికి అడ్డంతిరిగి వార్తల్లోకి వెక్కారు. డివిజన్లో సుపరిచితులుగా ఉన్న దీపక్ చౌదరి ఓటమితో కుంగిపోయారు. తాను ఈ రాజకీయాలకు సరిపోనని తనకు తాను నిర్ధారించుకున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. డైనమిక్ గా ఉండే దీపక్ చౌదరి కి నచ్చచెప్పేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది .
ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కు రాసిలేఖ యధాతంగా

శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారికి అద్యక్షులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 45 వ డివిజన్ నుండి పోటీ చేసి ఓటమి పాలైనందుకు నేను పూర్తి భద్యత వహిస్తు ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తు ప్రస్తుత రాజకీయాలకు నేను, నా మనత్సత్వం సరిపోదని భావిస్తు రాజకీయాలనుండి పూర్తిగా తప్పుకోదలచుకున్నాను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశాలు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాదించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. ఆ పార్టీలో వున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియ జేస్తు నేను ప్రస్తుతం ఉన్న ఖమ్మం నగర కాంగ్రెస్ కార్యనిర్వాహక అద్యక్షుడు పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను . ఈ రాజీనామా పత్రాన్ని ఆమోదించవల్సిందిగా కోరుతున్నాను.

Related posts

తెరాస పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

పెగాసస్ పై కాంగ్రెస్ ఛలో రాజభవన్ ఉద్రిక్తత …భట్టి, జగ్గారెడ్డి, సీతక్క అరెస్ట్…

Drukpadam

వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఉండదు…రాహుల్ గాంధీ…

Drukpadam

Leave a Comment