Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ కార్యాలయాల్లో కొత్త కార్పొరేటర్ల కోలాహలం… అభినందనల వెల్లువ

పార్టీ కార్యాలయాల్లో కొత్త కార్పొరేటర్ల కోలాహలం… అభినందనల వెల్లువ
-టీఆర్ యస్ సిపిఐ కార్పొరేటర్లు టీఆర్ యస్ కార్యాలయంలో
-కాంగ్రెస్ కార్పొరేటర్లు సంజీవరెడ్డి భవన్ లో
-సిపిఎం కార్పొరేటర్లు సుందరయ్య భవన్ లో
కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు వివిధ పార్టీ కార్యాలయాలలకు వెళ్లడంతో సందడి నెలకొన్నది.గెలిచిన కార్పొరేటర్లు ఈ సందర్భంగా మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు . టీఆర్ యస్ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , రాములు నాయక్ , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య మాట్లడుతూ ఈ గెలుపు క్రిడెట్ అంతా మంత్రి పువ్వాడ అజయ్ డే అని అన్నారు.ఒక్క చేతితో గెలిపించారని కొనియాడారు. ఈ సందర్భంగా గెలిచిన కార్పొరేటర్లను నాయకులూ అభినందించారు. ఖమ్మం అభివృద్ధిలో తమవంతు పాత్ర నిర్వించాలని కోరారు.

ఇది అక్రమాలు గెలుపు … కాంగ్రెస్
కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశంలో సీనియర్ నాయకులూ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని , పోలీస్ యంత్రాగాన్ని ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని కుని చేసి టీఆర్ యస్ అక్రమంగా గెలిచిందని ఆరోపించారు. ఎన్ని ఆవరోధాలు సృష్టించిన వాటిని ఎదురుక్కొని నిలబడి గెలిచిన కార్పొరేటర్లకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.అనేక ప్రలోభాలు ,నిర్బంధాలు , పోలీసుల నిరంకుశ వైఖరి అరెస్టులు , తట్టుకొని నిలబడిన పోటీచేసిన అభ్యర్థులకు , పని చేసిన కార్యకర్తలకు , ఓట్లు వేసిన ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్లు పోట్ల పేర్కొన్నారు.జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలుస్వేచ్ఛగా జరిగితే కాంగ్రెస్ పార్టీ కు మరిన్ని డివిజన్లు వచ్చేవని అన్నారు.ఈ సందర్భంగా గెలిచిన కార్పొరేటర్లను అభినందించారు.


సిపిఎం కార్పోరేటర్ల అభినందన
సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో సిపిఎం తరుపున గెలిచిన యర్రా గోపి, వెలంపల్లి వెంకటరావు లను అభినందించారు.ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు , జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు మాట్లాడుతూ సిపిఎం వాణిని కార్పొరేషన్ లో వినిపించాలని కోరారు.

Related posts

కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగిన చందంగా ఉంది: వై.ఎస్‌.షర్మిల…

Drukpadam

కేటీఆర్ కనిపించుటలేదు’… హైదరాబాద్ నగర శివార్లలో నిరసన పోస్టర్లు….

Drukpadam

తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం …. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు!

Drukpadam

Leave a Comment