Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం మేయర్ గా సీల్డ్ కవర్ లో పేరెవరిది ?

ఖమ్మం మేయర్ గా సీల్డ్ కవర్ లో పేరెవరిది ?
-పూనుకొల్లు నీరజ ?లేక పైడిపల్లి రోహిణినా ,బిక్కసాని ప్రశాంత లక్ష్మి వీరిలో ఎవరు ?
-పరిశీలనలో మరో రెండు పేర్లు అంటున్న టీఆర్ యస్ వర్గాలు
-7 న మేయర్ ఎంపిక
-ఇందుకోసం పరిశీలకులను పంపనున్న కేసీఆర్
-ఇప్పటికే పరిశీలకులకు సూచనలు చేసిన కేసీఆర్
-జిల్లామంత్రి తోనూ చర్చించినట్లు సమాచారం

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 60 డివిజన్లకు గాను 43 డివిజన్లలో టీఆర్ యస్ తన మిత్రపక్షం గా ఉన్న సిపిఐ కు రెండు కలిపితే కూటమి 45 డివిజిన్లలో ఘనవిజయం సాధించింది . మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు అయింది. దీంతో ఖమ్మం మేయర్ గా టీఆర్ యస్ ఎవరిని ఎంపిక చేస్తుంది. కాబోయే మేయర్ ఎవరు అనేది ఆశక్తిగా మారింది. మేయర్ గా 26 డివిజన్ నుంచి గెలుపొందిన పూనుకొల్లు నీరజ అంటూ వార్తలు వెలువడటంతో దీనిపై పలువురు ఆరా తీస్తున్నారు.నిజంగా ఆమెను ఎంపిక చేశారా ? అంటూ మీడియా వారికీ ఫోన్ లు చేసి అడుగుతున్నారు. దీనిపై ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో మొన్న జరిగిన మున్సిపల్ పోరులో ఐదు మున్సిపాలిటీలు , రెండు కార్పొరేషన్లలో టీఆర్ యస్ ఘనవిజయం సాధించింది. ఈ పురపాలనలలో మేయర్ లు , చైర్మన్ లను డిప్యూటీ ,వైస్ చైర్మన్ లను ఎంపిక చేయాల్సివుంది. ఇందుకోసం పరిశీలకులను నియమించారు. ఖమ్మం మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం మంత్రి వేముల ప్రశాంతారెడ్డి , టీఆర్ యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి లను నియమించారు . వారు వచ్చి ఇక్కడ మేయర్ ,డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక పై పార్టీ ముఖ్యమంత్రి అభిప్రాయాలు చెప్పి అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం నిర్ణయం మేరకు సీల్డ్ కవర్లో సీఎం అభిప్రాయాలకు అనుగుణంగా ఎంపిక చేసిన అభ్యర్థిని ప్రకటిస్తారు. ఈ విషయంలో జిల్లా మంత్రి ,స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. మంత్రి కూడా ఇక్కడ ఎవరైతే బాగుంటుందని ఆలోచించే తన అభిప్రాయాలూ చెప్పే అవకాశాలు ఉంటాయి. ముందుగానే ఒక అభ్యర్థికి మేయర్ ఇస్తామని చెప్పలేదు. చెప్పే సంస్కృతీ టీఆర్ యస్ లో లేదు. మొత్తం కార్పొరేషన్ లో 36 మంది మహిళలు గెలిచారు. కార్పొరేషన్ మేయర్ మహిళా జనరల్ కు కేటాయించటం జరిగింది. అంటే ఏ కులంలో గెలిచిన మహిళను అయినా మేయర్ గా చేసే అవకాశం ఉంది. అయితే జనరల్ మహిళ అంటే ఉన్న సామాజికవర్గాలలో అక్కడ ఉన్న పరిస్థితులు రాజకీయ సమీకరణాలు బట్టి మేయర్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. మంత్రి కూడా ఎవరు బెటర్ అనే కోణంలో ఆలోచన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి ఇంటలిజన్స్ రిపోర్టులు కూడా ఉంటాయి . అందువల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవసరాలకు అనుగుణంగా మేయర్ ఎంపిక జరుగుతుందని ఒక టీఆర్ యస్ నేత వ్యాఖ్యానించాడు. ఈ సారి ఖమ్మం లో గెలిచిన మహిళలో చాలామంది ఉన్నత విద్యావంతులుగా ఉన్నయువతులు ఉన్నారు .పూనుకొల్లు నీరజాతో పాటు 56 డివిజన్ నుంచి గెలిచిన పైడిపల్లి రోహిణి , 20 డివిజన్ నుంచి గెలిచిన బిక్కసాని ప్రశాంత లక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. వీరు గాక మరో రెండు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలకులతోను జిల్లా మంత్రి అజయ్ తో మాట్లాడినట్లు సమాచారం . వారు ఈ నెల 7 ఉదయం టీఆర్ యస్ జిల్లా కార్యాలయంలో జరిగే నూతన కార్పొరేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి పంపిన సీల్డ్ కవర్ తెరిచి మేయర్ , డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. డిప్యూటీ మేయర్ గా బీసీ లేదా ముస్లిం మైనార్టీ నుంచి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అంత వరకు ఎన్నో పేర్లు షికార్లు చేసే అవకాశం ఉంది.

Related posts

బీజేపీకో హటావో …దేశ్ కి బచావో … ఖమ్మం బీఆర్ యస్ సభలో కేసీఆర్  పిలుపు …

Drukpadam

మళ్లీ సీఎం జగనే…కాకుంటే రాజకీయసన్యాసం మంత్రి ధర్మాన కృష్ణదాస్!

Drukpadam

నేను విమర్శించింది జగన్ ను కాదు.. ఆ ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి!

Drukpadam

Leave a Comment