Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

జనం కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయక్రీడ ఆడుతున్నారు… సీఎల్పీ నేత భట్టి

జనం కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయక్రీడ ఆడుతున్నారు… సీఎల్పీ నేత భట్టి
-కరోనాతో ప్రజలు చస్తుంటే …రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది
-ఆక్సిజన్,మందులు ,ఇంజక్షన్ లు ,వ్యాక్సిన్లు లేక ప్రజలు ఆందోళన చెందుతుంటే
-సి ఎస్ అన్ని ఉన్నాయని అబద్దాలు ఆడుతున్నారు
-టెస్టులనుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు
-ఒకపక్క ఆరోగ్యం పై యుద్ధం జరుగుతుంటే …
-ఆరోగ్యమంత్రిని తొలగించేందుకు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రణాళికలు రూపొందించారు
– కరోనా కట్టడిని వదిలి భూకబ్జా ఆరోపణలపై అధికారులను పరుగులు పెట్టించారు
-అసెంబ్లీ లో కరోనా పై టాస్క్ ఫోర్స్ అన్నారు … అది ఉందో లేదో తెలియదు
-కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చుతామన్న మాటిచ్చి మరిచారు
-ప్రవేట్ హాస్పటల్స్ లో పేషంట్లను జలగల్లా పిల్చుతుంటే చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు

తెలంగాణ రాష్ట్రలో ప్రజలు కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయక్రీడ ఆడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . హైదరాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలి మొద్దునిద్రపోతున్నారని మండిపడ్డరు.ప్రపంచం అంత కరోనా పై యుద్ధం చేస్తుంటే ఆశాఖ మంత్రిని తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు . కరోనా కట్టడిలో శ్రద్దలేదుగాని భూకబ్జా ఆరోపణలపై అధికారులని పరుగులు పెట్టించారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. ఆక్సిజన్ , మందులు , ఇంజక్షన్ లు ,వ్యాక్సిన్లు లేక ప్రజలు ఆందోళన చెందుతుంటే అంత బాగుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని సి ఎస్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చీఫ్ సెక్రటరీ లాంటి అధికారి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తే ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రజలకు సరైన వైద్యం అందడంలేదని , ఆక్సిజన్ లేక ప్రజలు అల్లాడుతున్నారని , ఖమ్మం లో మూడు రోజులుగా ఆక్సిజన్ లేక ఆసుపత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయని , ఒకరకంగా చెప్పాలంటే ప్రజలను మీ చావు మీరు చావండి అని పేషంట్లను గాలికి వదిలేసినట్లు ఉందని విమర్శలు గుప్పించారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాట మర్చిపోయారని అన్నారు. కరోనా కోసం రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారని , అది ఏమైందో దాని రిపోర్ట్ ఎక్కడ ఉందో లేదో ఎవరికీ తెలియదని అన్నారు. ప్రజలకు కావలిసిన మందులు ,ఇంజెక్షన్ లు , ఆక్సిజన్ , బ్లాక్ మార్కట్లో అమ్ముతున్న చర్యలు తీసుకోక పోవడం శోచనీయమన్నారు . రాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆపాయిట్మెంట్ అడుగుతున్నామని ఇస్తే వెళ్లి కలుస్తామని అన్నారు. రాష్ట్ర గవర్నర్ ను కూడా కలవబోతున్నట్లు తెలిపారు . ప్రవేట్ ఆసుపత్రులలో రోగులను జలగల్లా పీక్కు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కట్లో సిలిండర్ ధర 5 వేల రుబయలు పలుకుతుందన్నారు . ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసిన రెమిడీసివియర్ ఇంజక్షషన్ సైతం బ్లాక్ లో అమ్ముతున్న వైనాన్ని ప్రస్తావించారు . కరోనా తో ప్రజలు ఆందోళనతో ఉన్నారని అందువల్ల ప్రభుత్వం తీసుకునే చర్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని భట్టి డిమాండ్ చేసారు . ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో ఇప్పటికైనా సమగ్ర ప్రణాళికతో ముందుకు పోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ సహకరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. కరోనా నిర్ములన కోసం కలిసి కట్టుగా యుద్ధం చేయాలనీ అన్నారు.

Related posts

మరోసారి సకల జనుల సమ్మె జరగాల్సిందే : బండి సంజయ్…

Drukpadam

కమ్మకులం పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని!

Drukpadam

చంద్రబాబు మాటలు అర్థరహితం : సజ్జల ….

Drukpadam

Leave a Comment