తమిళనాట స్టాలిన్ క్యాబినెట్లో గాంధీ, నెహ్రూ!
- రాణిపేట్ నుంచి గెలిచిన ఆర్.గాంధీ
- ఖాదీ, గ్రామీణ మంత్రిగా క్యాబినెట్లో చోటు
- తిరుచ్చిలో ఎదురులేని కేఎన్ నెహ్రూ
- పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా డీఎంకే సర్కారు ఏర్పడింది. కాగా, స్టాలిన్ నూతన క్యాబినెట్లో గాంధీ, నెహ్రూలకు స్థానం లభించింది! దేశ స్వాతంత్ర్యం, అనంతరం పరిస్థితులకు సంబంధించి గాంధీ, నెహ్రూల పేర్లు ఎంత ప్రముఖమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆశ్చర్యకరంగా స్టాలిన్ క్యాబినెట్లో ఇవే పేర్లున్న ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
రాణిపేట్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.గాంధీకి తమిళనాడు కొత్త మంత్రివర్గంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ లభించింది. అదే సమయంలో, తిరుచ్చి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కేఎన్ నెహ్రూను కూడా స్టాలిన్ క్యాబినెట్లోకి ఆహ్వానం పలికారు. నెహ్రూకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఈ తమిళనాడు గాంధీ, నెహ్రూలపై గతంలో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి