Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్ళరు …భట్టి అసత్య ప్రచారం మానుకో …అనుయాయులు..!

పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్ళరుభట్టి అసత్య ప్రచారం మానుకోఅనుయాయులు..!
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లుతున్నారనేది అబద్ధమన్న డాక్టర్ కోట రాంబాబు
పొంగులేటి పై అసత్య ప్రచారం చేయడంపై అనుయాయుల రుసరుసలు
భట్టి వక్రబుద్ధిని ప్రజలు ఎవ్వరూ నమ్మరని ధ్వజం
తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న పొంగులేటి
ఖమ్మం లోని ఆయన నివాసానికి క్యూకడుతున్న నేతలు

మాజీ ఎంపీ పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది. ఆయన పార్టీలో చేరబోతున్నారనేది ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది .ఆయన రాజకీయ నిర్ణయంపై ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఆయన రాజకీయ భవిష్యత్ తోపాటు ఆయన నమ్ముకున్న అనుయాయుల రాజకీయ భవిష్యత్ కూడా ఉంది. బీఆర్ యస్ ఇంకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదుఅయితే ఆయన ఇప్పటివరకు తన పర్యటనలలో సందర్భంగా ప్లెక్సీలలో పెట్టిన కేసీఆర్ ,కేటీఆర్ ఫోటోలు కనిపించడంలేదు . తన రాజకీయ నిర్ణయంపై మల్లగుల్లాలు పడుతున్నారు .

ఇటీవల ఖమ్మం లో బీఆర్ యస్ బహిరంగ సభ ఉన్నందున తన పర్యటనలు వాయిదా వేసుకున్న పొంగులేటి తిరిగి పర్యటనలు మొదలు పెట్టారు. ఆయన వెంట అనుయాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు .ఆయన్ను ఖమ్మంలోని ఇంటివద్ద కలుసుకునేందుకు ఆయన అభిమానులు క్యూకడుతున్నారు .ఆయన అభిప్రాయం తెలుసుకునేందుకు తాపత్రయపడుతున్నారు .ఆయన్ను కలిసి తమ అభిప్రాయాలు చెబుతున్నారు .సోషల్ మీడియాలో సైతం ఆయన ఏపార్టీలో చేరితే బాగుంటుందనే అభిప్రాయం సేకరణ జరుగుతుంది. దాంట్లో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. అందులో 60 శాతం పైగా ఆయన కాంగ్రెస్ లో చేరాలని రాగ , కేవలం 25 శాతం బీజేపీలో చేరాలని కోరుకుంటున్నారు . బీఆర్ యస్ లో ఉండాలని కేవలం 3 శాతం మాత్రమే అనుకుంటున్నారు . అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది .

ఆయన్ను రాజకీయంగా ప్రజల్లో బలహీన పరచేందుకు సహజంగానే ప్రత్యర్థులు సిద్ధం అవుతున్నారు . అందువల్ల ఆయన రాజకీయ నిర్ణయం ఆలస్యమైతే నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీ లో చేరితే ముస్లింల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా బీజేపీ విధానాలపై నిత్యం విరుచుకుపడే లెఫ్ట్ పార్టీల నుంచి ఇబ్బందులు తప్పవు . అయితే అనుయాయులు చెబుతున్న దాని ప్రకారం ఆయన బీజేపీ వైపు ముగ్గు చూపుతున్నారనే విషయం ధ్వనిస్తుంది.

సీఎల్పీ నేత భట్టి సోషల్ మీడియా వేదికగా పొంగులేటి చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారని ఇది పచ్చి అబద్దమని , అసత్యమని పొంగులేటి అనుయాయుయుడు మధిర కు చెందిన ప్రముఖ వైద్యులు డా కోట రాంబాబు ఖండించడం గమనార్హం . సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ లోకి పొంగులేటి అనే అసత్య ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు .ఇటువంటి అసత్య ప్రచారాలు ఆయన సహజంగానే చేస్తాడని అంటూ ,”భట్టి నీ వక్రబుద్ధిని మానుకో“….. నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా మధిర నియోజకవర్గ ప్రజలు నమ్మరని విమర్శలు గుప్పించారు . ఆయన కోవర్టు రాజకీయాల వల్ల అధిష్టానం దగ్గర విశ్వసనీయత కోల్పోయాడని దుయ్యబట్టారు . దీంతో మతి భ్రమించి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని ఒక కొత్త పుకారుకు తెరలేపుతున్నారని మండి పడ్డారు . మధిర నియోజకవర్గం ప్రజలు భట్టిని సాగనంపే సమయం దగ్గరలోనే ఉందన్నారు . ప్రజలు ఎవ్వరూ కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు . పొంగులేటి పార్టీ లోకి వెళ్లినా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలిపి వారి సంఘీభావం తోనే వెళ్తారని రాంబాబు పేర్కొన్నారు .

మీడియా సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వరరెడ్డి , అనంతరెడ్డి , ఉమ్మినేని కృష్ణ , వేమిరెడ్డి లక్ష్మారెడ్డి , కటికల సీతారామి రెడ్డి , శీలం వెంకట్రామిరెడ్డి , కిరణ్ తదితరులు పాల్గొన్నారు….

Related posts

భారత రాజకీయాలను మలుపు తిప్పే శక్తి ఒక్కకేసిఆర్ కే ఉంది:మంత్రి పువ్వాడ!

Drukpadam

పాపం.. సోము వీర్రాజుకు అప్పుడెందుకు బాధ కలగలేదో?:సుంకర పద్మశ్రీ!

Drukpadam

సోనియాతో అశోక్ గెహ్లాట్ భేటీ… 2 గంట‌ల‌కు పైగా కొన‌సాగిన చ‌ర్చ‌లు!

Drukpadam

Leave a Comment