ఖమ్మం కార్పోరేషన్ మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ,షేక్ ఫాతిమా ముఖ్తార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నిరోజులుగా మేయర్ ,డిప్యూటీ మేయర్లు ఎవరు అవుతారనే దానికి తెర దించుతూ కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చిన పరిశీలకుల సమక్షంలో పేర్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ,ఖమ్మం ఎం పి నామ నాగేశ్వరరావు ,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమక్షంలో పేర్లను ప్రకటించారు. అనంతరం కార్పోరేషన్ మీటింగ్ హల్ లో నూతన మేయర్ ,డిప్యూటీ మేయర్లను లాంఛనంగా ఎన్నుకున్నారు. 2/3 వంతుల మెజారిటీ ఉండటంతో ప్రతిపాదన బలపరచటం చేతులెత్తటం క్షణాల్లో జరిగి పోయాయి. కరోనా కారణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నిక అనంతరం ప్రశాంతరెడ్డి, నామ తో పాటు సుడా చైర్మన్ బి విజయకుమార్ లు మేయర్,డిప్యూటీ మేయర్లను అభినందించారు. మంత్రి పువ్వాడ అజయ్ హోం ఐసోలేషన్ లో ఉన్నందున హాజరు కాలేదు.
కాంగ్రెస్,సిపిఎం ,సిపిఐ ,స్వతంత్రులు హజరైయ్యారు