Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త… కరవుభత్యం పెంపు!

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త… కరవుభత్యం పెంపు!

  • కరవుభత్యం పెంచిన సర్కారు
  • 2.73 శాతం డీఏ/డీఆర్ పెంపు
  • 20.02 శాతానికి పెరిగిన కరవుభత్యం
  • 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామన్న హరీశ్ రావు

ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న కరువు భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది .రాష్ట్ర ఆర్ధికమంత్రి తన్నీరు హరీష్ రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు .ఇది ఉద్యోగులకు ,పెన్షన్ దార్లకు వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది .

తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరవుభత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా కరవుభత్యం 17.29 శాతం ఉండగా, తాజా పెంపుతో 20.02 శాతానికి చేరింది. 

దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కరవుభత్యం పెంపుతో 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదారులు లబ్దిపొందనున్నారని వెల్లడించారు. పెంచిన కరవుభత్యం 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామని తెలిపారు. 

Related posts

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఎంపీ నామ ఘ‌న‌స్వాగతం

Drukpadam

గరిటె పట్టిన పంజాబ్ సీఎం.. ఒలింపిక్ వీరులకు వండి వడ్డించిన ముఖ్యమంత్రి!

Drukpadam

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ..

Drukpadam

Leave a Comment