Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్‌కు 190-250 మిలియన్ల కరోనా టీకా డోసులు పంపనున్న గవీ!

Gavi to send 190 to 250 million corona vaccine doses to India
భారత్‌కు 190-250 మిలియన్ల కరోనా టీకా డోసులు పంపనున్న గవీ!
  • భారత్‌లో కరోనా ఉద్ధృతిపై గవీ ఆందోళన
  • టీకాతో పాటు 30 మి.డాలర్ల ఆర్థిక సాయం
  • సీరం నుంచి అందాల్సిన టీకాల సరఫరాలో జాప్యం
  • ఆ లోటును ధనిక దేశాల మిగులు డోసులతో భర్తీ
వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ గవీ భారత్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీ నిమిత్తం ఏర్పాటైన కొవాక్స్‌ బోర్డు డిసెంబరులో తీసుకున్న నిర్ణయం మేరకు 190-250 మిలియన్ల కరోనా టీకా డోసులు భారత్‌కు పంపనున్నట్లు వెల్లడించింది. అలాగే భారత్‌లో సాంకేతికత సహకారం, టీకా నిల్వ వసతుల పెంపునకు 30 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు గవీ అధికార ప్రతినిధి తెలిపారు.

తాజాగా భారత్‌ ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం వల్ల యావత్తు వ్యాక్సిన్ల సరఫరా దెబ్బతిందని గవీ అభిప్రాయపడింది. అలాగే దేశీయ అవసరాలపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ దృష్టి సారించడం వల్ల, ఇతర దేశాలకు టీకాల పంపిణీ కార్యక్రమంపై ప్రభావం పడిందని పేర్కొంది. సీరం నుంచి చాలా టీకా డోసులు రావాల్సి ఉందని.. దీంతో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని తెలిపింది. దీన్ని ధనిక దేశాల వద్ద ఉన్న మిగులు నిధులతో పూడ్చాలనుకుంటున్నామని పేర్కొంది.

Related posts

తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత…

Drukpadam

వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయితే మేము ఉరేసుకోవాలా కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆశక్తి కార వ్యాఖ్యలు

Drukpadam

బిగ్ బాస్ ఒక కన్నేశాడు …మాస్క్ పెట్టుకోవడం మరవద్దు హైద్రాబాద్ మెట్రో…

Drukpadam

Leave a Comment