కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది దుర్మరణం
పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ఘటన
తునాతునకలైన మృతదేహాలు
అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు
బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి తరలిస్తుండగా ఘటన
కడప జిల్లాలో కలకలం చెలరేగింది. భారీ పేలుడు సంభవించి 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాదవశాత్తు వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
కడప జిల్లా మామిళ్లపల్లెలో ఓ ముగ్గురాయి గని వద్ద పేలుడు జరిగి 10 మంది మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆయన అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలసపాడు మండలం మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ ను కిందికి దింపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి వాహనం తుత్తునియలు అయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి.
కడప జిల్లాలో పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: చంద్రబాబు
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా పేలుడు సంభవించి తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమందికి గాయాలైన విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడప పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఎలాంటి ఘటనలు తరుచు జరుగుతున్నాయని పేరుకొన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.మృతుల కుటుంబాలకు ఎక్సగ్రేషయో ఇవ్వాలని డిమాండ్ చేశారు.