Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా…ఏపీలోని గుడివాడకి రమ్మంటున్నారు …రేణుకాచౌదరి!

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా…ఏపీలోని గుడివాడకి రమ్మంటున్నారు …రేణుకాచౌదరి..!
-అవసరమైతే గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తా: రేణుకా చౌదరి
-తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు బాధాకరమన్న రేణుక
-ఇన్చార్జి వచ్చి పరిష్కరిస్తుండడం పట్ల సిగ్గుపడుతున్నట్టు వెల్లడి
-ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానన్న ఫైర్ బ్రాండ్
-గుడివాడలో పోటీ చేయాలన్న ఆహ్వానం ఉందని వివరణ

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు బాధాకరమని, పార్టీ ఇన్చార్జి వచ్చి గొడవలు పరిష్కరించాల్సి రావడం పట్ల సిగ్గుపడుతున్నానని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానని రేణుకా చౌదరి వెల్లడించారు. రేవంత్ ను ఖమ్మం ఆహ్వానిస్తామని చెప్పారు.

ఇక, పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. తాను ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రేణుకా చౌదరి వెల్లడించారు. తనకు ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీచేయాలన్న ఆహ్వానం ఉందని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని చెప్పారు.

ఎక్కడా దిక్కులేని వాళ్లు చేరేది కాంగ్రెస్ పార్టీలోనే అని వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరే విషయం కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే చూసుకుంటారని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆమె నర్మగర్భవ్యాఖ్యలు చేశారు . ఖమ్మంలో అసెంబ్లీకి పోటీచేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారని అన్నారు .పార్టీ అభివృధ్ధికోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించాలని అధిష్టానానికి తెలిపామన్నారు .రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటానని , ఆయన్ను ఖమ్మం కూడా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు .పార్టీలో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్ నిశితంగా గమనిస్తుంది అన్నారు . రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. అందుకు ఎన్నికల నాటికీ అన్ని సర్దుకుంటాయని పేర్కొన్నారు . ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అనే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైన విషయాన్నీ ఆమె గుర్తు చేశారు .

Related posts

ప్రొద్దటూరు వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి ముస్లింల య‌త్నం!

Drukpadam

ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే సీఎం జగన్… కొడాలి నాని వ్యాఖ్యలు!

Drukpadam

రాజ్య‌స‌భ‌లో బీజేపీ విప్‌గా జీవీఎల్ న‌ర‌సింహారావు నియామ‌కం!

Drukpadam

Leave a Comment