Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలపై మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు…

టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలపై మూడ్రోజుల ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు…

  • టర్కీ, సిరియాల్లో భూకంప విలయం
  • వేల సంఖ్యలో మృతులు
  • శవాల దిబ్బలు కనిపిస్తున్న వైనం
  • భూకంపంపై ఇటీవల ట్వీట్ చేసిన ఫ్రాంక్ హూగర్ బీట్స్

టర్కీ, సిరియా దేశాల్లో 12 గంటల వ్యవధిలోనే మూడు తీవ్ర భూకంపాలు సంభవించడంపై ఓ డచ్ పరిశోధకుడు ముందే అంచనా వేశాడన్న విషయం తాజాగా వెల్లడైంది. నెదర్లాండ్స్ కు చెందిన ఫ్రాంక్ హూగర్ బీట్స్ సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే (ఎస్ఎస్జీఈఓఎస్) సంస్థలో పరిశోధకుడిగా ఉన్నారు.

7.5 తీవ్రతతో సెంట్రల్ టర్కీతో పాటు సిరియా, లెబనాన్, జోర్డాన్ దేశాల్లో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని మూడు రోజుల ముందే హెచ్చరించారు. అయితే, హూగర్ బీట్స్ గతంలోనూ ఇలాంటి అంచనాలే వెలువరించగా, అవి నిజం కాలేదు. కానీ, ఈసారి ఆయన అంచనాల ప్రకారమే టర్కీ, సిరియాల్లో భూకంపం పెనువిపత్తు సృష్టించింది.

దీనిపై హూగర్ బీట్స్ స్పందిస్తూ… గతంలో ఈ విధంగా 115 ఏళ్ల కిందట వచ్చిందని వివరించారు. ఈ భూకంపాలను గ్రహ సంబంధ సంక్లిష్ట రేఖా గణితం ఆధారంగా అంచనా వేయగలిగినట్టు తెలిపారు. కానీ, తన అంచనాలు నిజమై టర్కీ, సిరియా దేశాల్లో పెద్ద సంఖ్యలో మృతి చెందడం చాలా బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. తాజా భూకంపాల నేపథ్యంలో ఫిబ్రవరి 3న హూగర్ బీట్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Related posts

మతిమరుపా …? అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే …!

Drukpadam

నియో నాజీలనుంచి ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించేందుకే సైనిక చర్య :పుతిన్!

Drukpadam

ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి 24 గంట‌ల డెడ్‌లైన్: కేసీఆర్

Drukpadam

Leave a Comment