Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కోవిడ్ పై క్షేత్ర స్థాయిలో అవగాహన చర్యలు, వాక్సినేషన్ ఏర్పాట్లు చేపట్టండి౼ మంత్రి పువ్వాడ.

కోవిడ్ పై క్షేత్ర స్థాయిలో అవగాహన చర్యలు, వాక్సినేషన్ ఏర్పాట్లు చేపట్టండి౼ మంత్రి పువ్వాడ.

◆ నిరంతరం హాస్పిటల్స్, కోవిడ్ కేంద్రాలను పర్యవేక్షించాలి.

◆ కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయండి.

◆ వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి.

◆ కోవిడ్ నివారణ చర్యలపై జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రోజు రోజుకి తీవ్ర రూపం ప్రదర్శిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను దీని కోరల్లో చిక్కుకోకుండా కాపాడాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజ , ఉప మేయర్ ఫాతిమా జోహారా , జిల్లావైద్యాధికారి మాలతి , జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కోవిడ్ తీవ్రత, వాక్సినేషన్, ఆక్సిజన్ లభ్యత, ఇంటింటికి జ్వర సర్వే,Antigen, RT-PCR టెస్ట్స్ పై సమీక్ష నిర్వహించారు.

కరోనా నివారణ విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు హాస్పిటల్స్ లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఫీవర్ సర్వే ద్వారా గ్రామాల్లో ఇంటింటికి కరోనాపై అవగాహన కల్పించాలని, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని సూచించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నిత్యం కరోనాపై సమీక్ష చేస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో ఎప్పటికప్పుడు కరోనా కేసులను, పురోగతి వివరాలను సమర్పించాలన్నారు. ఆక్సిజన్, లభ్యత, మందుల కొరత, టెస్ట్ కిట్ల కొరత రాకుండా చూడాలని, కొరత ఉంటే తెలపాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ తో మాట్లాడి అందుకు కావాల్సిన కిట్స్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందామని వివరించారు.

ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నారని, త్వరలోనే వైద్య సిబ్బంది మరింత పెరగనుందని తెలిపారు.

కరోనా పై ప్రజల్లో ధైర్యం కల్పిస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు.

పాత బస్ స్టాండ్ నందు కోవిడ్ పరీక్షలు జరుపుతూ అన్ని వసతులు ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాయకల్ప అవార్డ్ పొందిన విషయం గుర్తు చేశారు.

కోవిడ్ పేషెంట్స్ కు ఆక్సీజన్ కొరత లేకుండా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.90 లక్షలతో నిర్మించిన Oxygen Generated Plant ను ఏర్పాటు చేసుకోవాడం శుభ పరిణామం అన్నారు.

ప్రతి రోజు 125 సిలిండర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుతో ఆక్సిజన్ కష్టాలు లేవని అన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణవాయువు కు ఇబ్బంది లేదన్నారు.

Remdesiver ఇంజక్షన్ లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ నల్ల మార్కెట్ లో లేకుండా పోలీస్ వ్యవస్థ బాగా పని చేస్తుందని అందుకు పోలీస్ కమిషనర్ ను అభినందించారు.

కోవిడ్ నివారణ చర్యలపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళికతో అన్ని సౌకర్యాలు అందిస్తున్నారని అన్నారు.

Related posts

పునీత్ మృతిపై రజనీకాంత్ సంతాపం.. కన్నింగ్ ఫెలో అంటూ రజనీపై విమర్శల వెల్లువ!

Drukpadam

చంద్రబాబు షేర్ చేసిన వీడియోలోని వృద్ధురాలికి పెన్షన్ పునరుద్ధరణ!

Drukpadam

ఇది మీకు తెలుసా ..? రోజుకు ఎన్ని బాదం గింజలు తినాలి..?

Drukpadam

Leave a Comment