భారతీయ రైళ్లకు పేరు ఎలా పెడతారో తెలుసా..?
ఎక్కువ శాతం రైళ్లకు గమ్యస్థానాల పేర్లు
లేదంటే ఆయా మార్గాల్లో ప్రాశస్త్యం గల ప్రాంతాల పేర్లు
రాజధాని, శతాబ్ది, దురంతో పేర్లు ప్రత్యేకం
భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు పెడుతుంటుంది. అసలు ఈ పేర్లను ఎలా నిర్ణయిస్తారన్నది ఆసక్తికరం. చాలా మందికి దీని గురించి తెలియదు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కావడం గమనార్హం.
సాధారణంగా రైల్వేలకు వాటి గమ్యస్థానాల పేర్లనే పెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతర పేర్లను కూడా ఖరారు చేస్తారు. రైలు ప్రయాణించే ప్రాంతాల్లో వాడుకలోని కొన్ని పేర్లు కూడా పెడుతుంటారు. ఉదాహరణకు శతాబ్ది ఎక్స్ ప్రెస్ అన్నది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా 1989లో మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు. భారతీయ రైల్వే నిర్వహించే దూర ప్రాంత రైలు ఇది.
ఇక రాజధాని ఎక్స్ ప్రెస్ అంటూ దేశ రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే రైళ్లకు పెట్టారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. అందుకే రాజధాని పేరు సరిగ్గా ఉంటుందని అలా ఖరారు చేశారు. ఇక దురంతో ఎక్స్ ప్రెస్ పేరును గమనిస్తే.. దురంతో అంటే అవాంతరాలు లేనిది. హైదరాబాద్ నుంచి త్రివేండ్రమ్ మధ్య రైలుకు శబరి ఎక్స్ ప్రెస్ పేరు. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం. అందుకని శబరి పేరు పెట్టారు. ఇలా ప్రత్యేకమైన పేర్లు చాలా తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానం పేర్లు నిర్ణయిస్తుంటారు. కృష్ణానది మీద నుంచి ప్రయాణం చేస్తుంది కనుక దానికి కృష్ణా ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు . హైద్రాబాద్ గుంటూరు మధ్య నడుస్తున్న రైలుకు గోల్కొండ అని గోదావరి నది దాటే హైద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే ట్రైన్ కు గోదావరి అని , కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే ట్రైన్ కు కన్యాకుమారి అని , కాకతీయ, సింగరేణి , జాంనగర్ , పాట్నా , వారణాసి , అమృత్సర్ హౌరా , కోరమాండల్ , నవజీవన్,పినాకిని , కోణార్క్ , రాయలసీమ , తిరుపతి లాంటి పేర్లతో సాధారణ ప్రజలకు అర్థం అయ్యేలా పేర్లు పెట్టారు .