Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పసివాడి జబ్బుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ :అండగా నిలిచిన ప్రపంచం

పసివాడి జబ్బుకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ :అండగా నిలిచిన ప్రపంచం
-క్రౌడ్ ఫండ్ కు పిలుపు … స్పందించిన 2 .64 లక్షల మంది
-16 కోట్ల రూపాయలు సహాయం: అమెరికా నుంచి వచ్చిన ఇంజక్షన్
-ముంబై హిందూ జా ఆసుపత్రిలో వైద్యం …బాబు క్షేమం
-ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు ;సంతోషం వ్యక్తం చేసిన దాతలు
గుజరాత్ రాష్ట్రంలోని 5 నెలల పసివాడికి ఒక ఇంత వ్యాధి సోకింది. చిల్లి గవ్వ లేని ఆ పేద కుటుంబానికి ప్రపంచం అండగా నిలిచింది. ఆ పసివాడి వైద్యానికి కావలిసిన ఆర్థిక సహాయం అందించింది. మహిసాగర్ జిల్లా లూనవాడా పట్టణానికి సమీపంలోని కనేసర్ అనే గ్రామంలో నివాసం ఉంటున్న రాజదీప్ సింగ్ రాథోడ్ ,జూనల్బ దంపతులకు దైర్యరాజ్ సింగ్ రాథోడ్ అనే పిల్లవాడు పుట్టాడు. అతనికి నెల రోజుల తరువాత శరీరంలోని కండరాలు , వెన్నుపూస పని చేయటంలేదు. హాస్పటల్ కు వెళ్ళితే అది స్పైనల్ మాస్క్యూలర్ ఆట్రోపీ జబ్బు అని తేలింది . ఇలాంటిది లక్షల్లో కొంతమందికి మాత్రమే వస్తుందని దానికి ఖరీదైన ఇంజక్షన్ ఇస్తే కండరాలు , శరీర భాగాలూ పనిచేసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. దాని ఖరీదు ఆరా తీయగా 16 కోట్లు చేస్తుందని అన్నారు. ఇక తమ స్తోమతకు మించిన భారమని పిల్లవాడి జబ్బునయం కాదేమోనని ఆందోళనలో ఉన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆ పసివాడి వ్యాధి నయం కావాలంటే ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ తెప్పించాలసిందే అన్నారు . ఆ ఇంజక్షన్ ఖరీదు వందలు వేలు కాదు ,లక్షలు కాదు, ఏకంగా కోట్లే. అవికూడా ఒకటి రెండు కాదు ఏకంగా 16 కోట్ల ఇంజక్షన్. ప్రవేట్ ఉద్యోగం, పూటగడవటమే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి ఏమి చేయాలో అంతుపట్టలేదు. ఆనోటా ఈనోటా విన్నవారు ఒక సలహా ఇచ్చారు. ఇంపాక్ట్ గ్రూప్ ప్లాట్ ఫారం ను సంప్రదించామన్నారు. దాని ప్రకారం రాథోడ్ కుటుంబం వారిని సంప్రదించింది. వెంటనే క్రౌడ్ ఫండ్ పుల్లర్ ద్వారా పిలుపునిచ్చారు. ప్రపంచం కదిలింది. దేశవిదేశాలలో దాతలు ముందుకు వచ్చారు. 42 రోజుల్లో ఇంజక్షన్ కు సరిపడా 16 కోట్లు రూపాయలు జమ అయ్యాయి. అమెరికాలోని స్విస్ ఫార్మా దిగ్గజ కంపెనీ నోవార్టిస్ కు ముందుగానే డబ్బు చెల్లించి ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం వారు ముంబై లోని హిందూ జా హాస్పటల్ కు ఇంజక్షన్ పంపించారు. దీనికి చెల్లించాల్సిన జి ఎస్ టి , దిగుమతి సుంకం కలిపి ఉన్న 6 .5 కోట్లను కేంద్రం పూర్తిగా మాఫీచేసింది బాబును హాస్పటల్ లో చేర్చి ఇంజక్షన్ ఇచ్చారు. ఇప్పుడు బాబు క్షేమంగా ఉన్నారు. కాళ్ళు ,చేతులు కండరాలలో తేడా వచ్చింది .
పిల్లవాడు ఇక సాధారణ జీవితం గడపనున్నారు. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు సహాయం చేసిన దాతలకు, జి ఎస్ టి ,దిగుమతి సుంకం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలు సంతోషం వ్యక్తం చేశారు. మానవత్వం వర్ధిల్లింది.

Related posts

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. భారతీయ కుటుంబం మృతి…

Drukpadam

యూపీలో కరోనా మాత పేరిట ఆలయం…..

Drukpadam

బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Ram Narayana

Leave a Comment