Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు అవుట్!

ఢిల్లీ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు అవుట్!
-జైన్ , సిసోడియా రాజీనామా
-నిర్దారించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
-వెంటనే లెఫ్టనెంట్ గవర్నర్ ఆమోదం
-కొత్తవారిని తీసుకునేది లేనిది స్పష్టత ఇవ్వని కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం లో సిబిఐ అరెస్ట్ చేసిన ఆరాష్ట్ర డిప్యూటీ టీమ్ మనీష్ సిసోడియా , సత్యంద్రకుమార్ జైన్ లను క్యాబినెట్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు . దీంతో వారు ఇరువురు మంత్రులు తమపదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . దీన్ని సీఎం కేజ్రీవాల్ నిర్దారించారు . వెంటనే వీరు రాజీనామాలను ఆమోదం కోసం లెఫ్టనెంట్ గవర్నర్ కు పంపించారు .వారు రాజీనామాలు ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది .లిక్క స్కాం లో మనీష్ సిసోడియా ను రెండవసారి విచారణకు పిలిచిన సిబిఐ 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు . తన అరెస్ట్ పై సిసోడియా సుప్రీంలో అప్పీల్ చేశారు . విచారణ జరిపిన సుప్రీం తిరిగి హైకోర్టు కు వెళ్లాలని సిసోడియా కు సూచన చేసింది . అయితే సిబిఐ ఆయన్ను 4 రోజుల కస్టడీ నిమిత్తం ఇవ్వలని చేసిన విజ్ఞప్తిని కోర్ట్ అంగీకరించింది . మరో కేసులో జైన ఇప్పటికే జైల్లో ఉన్నారు . ఆయన్ను కూడా రాజీనామా చేయాలనీ సీఎం కోరారు . ఇద్దరు రాజీనామాలు ఆమోదం పొందడంతో కొత్తగా మంత్రివర్గంలోకి మరో ఇద్దరినీ తీసుకుంటారా ? లేదా అనే విషయంపై సీఎం కేజ్రీవాల్ స్పష్టత ఇవ్వలేదు .

Related posts

‘అన్‌స్టాప‌బుల్ 2’లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబద్దాలే: వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి!

Drukpadam

పాలేరుపై కందాలకు ఫుల్ క్లారిటీ…

Drukpadam

ఎన్నిసార్లు ఓడించినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతే!: లోక్ సభలో ప్రధాని మోదీ

Drukpadam

Leave a Comment