Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా పై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్

కరోనా పై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు డిమాండ్
పార్టీ నేతలతో చంద్రబాబు వర్చువల్ భేటీ
ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు
కొవిడ్ పరిస్థితులపై చర్చించాలని సూచన
అందరికీ టీకా ఇవ్వాలని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొవిడ్ స్థితిగతులపై ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచారు. కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, తాజా పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంకా అనేక అంశాలపై చంద్రబాబు స్పందించారు.

కరోనా బాధితులకు ఇస్తున్న సాయం, ఇతర అంశాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలి.
ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు సాయం చేస్తామన్న సర్కారు, తన మాట నిలుపుకోవాలి.
కరోనా మృతులకు గౌరవప్రదంగా ప్రభుత్వమే దహనసంస్కారాలు నిర్వహించాలి.
ఇతర కారణాలతో మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలి.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయాలి.
కరోనా సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
కరోనా ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రుల్లో పడకల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి.

Related posts

తొలుత చంద్రబాబు.. మంత్రుల తర్వాత జగన్.. శాసనసభలో ప్రమాణ స్వీకారం

Ram Narayana

పాదయాత్రలో రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..

Drukpadam

వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తాం: ఏపీ పోలీస్ హెచ్చరిక

Ram Narayana

Leave a Comment