జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించినందుకు
మంత్రి అజయ్కుమార్కు , అధికారులకు
కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు
ఖమ్మం : కరోనా భయ పెడుతున్న తరుణంలో నిరంతరం విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు , వ్యాక్సినేషన్ ఇబ్బందికరంగా మారింది . పరీక్షా కేంద్రాలు , వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ ఉండడంతో జర్నలిస్టు సంఘాలు ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లాయి . వెంటనే స్పందించిన మంత్రి అజయ్ కుమార్ అధికారులతో సంప్రదించి ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు . బుధవారం 100 మందికి పైగా జర్నలిస్టులు వ్యాక్సిన్ వేయించుకున్నారు . ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని వేళల అండగా ఉంటామని కరోనా కష్ట కాలంలో జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు . మంత్రి అజయకుమార్ , కలెక్టర్ ఆర్వి కర్ణన్ , వైద్య – ఆరోగ్య సిబ్బందికి జర్నలిస్టు సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు . (టియుడబ్ల్యూజె) ఐజెయు ( టీయూడబ్ల్యూజే ) ,(టియుడబ్ల్యూజె – టిజెఎఫ్ ) , (టీయూడబ్ల్యూజే – టెమ్ జూ) , జిల్లా కమిటీలు కృతజ్ఞతలు తెలిపారు . అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడంతో పాటు ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేవిధంగా చర్యలు చేపట్టాలని కోరాయి. జర్నలిస్టులకు మున్ముందు కూడా ఇదే సహకారాన్ని అందించాలని కోరాయి . సమన్వయం చేసిన పౌర సంబంధాల శాఖాధికారులకు జర్నలిస్టు సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.