Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించాలి…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించాలి…
-ఒకే సారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం కరోనా ఆందోళన
-ప్రాధాన్యత క్రమంలో ఇక్కడ పనిచేసే వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలి
-తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు బొంతు రాంబాబు

వ్యవసాయ శాఖ, వ్యవసాయ మార్కెట్ ,సోసైటి, ఐకేపీ అధికారులు, సిబ్బంది మరియు హమాలీల ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ప్రభుత్వం గుర్తించి వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రాధాన్యత క్రమం లో ప్రత్యేక కౌంటర్లు వేర్పాటు చేయాలన్నారు. బుధవారం వైరా మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సకాలంలో ధ్యానం కొనుగోలు జరగడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగడం వల్ల వందలాది మంది రైతులు ఒకే సారి ఒకే దగ్గర కొనుగోలు కేంద్రాల్లో అధిక సంఖ్యలో జమ అవుతున్నారని అన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, సోసైటి సిబ్బంది, మార్కెట్ శాఖ అధికారులు, సిబ్బంది ఐకెపి సిబ్బంది తోపాటు పదుల సంఖ్యలో హమాలీలు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరికి కరోనా వైరస్ బారినపడకుండా వ్యాక్సిన్ అందించాలి అని డిమాండ్ చేశారు. అలాగే రైస్ మిల్లులు సిబ్బంది, హమాలీ లు కూడా ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. ధాన్యం రవాణా లో ఉండే లారీ డ్రైవరు లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. లేనిచో కరోనా గ్రామాల్లో కి వేగంగా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొందరు అధికారులు, సిబ్బంది కి కరోనా వచ్చి ధాన్యం కొనుగోలు కు ఇబ్బందులు వస్తున్నాయి పేర్కొన్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేస్తున్న అధికారులు,సిబ్బంది కి వ్యాక్సిన్ అందించాలి అని రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో తోట నాగేశ్వరావు, సుంకర సుధాకర్, మాడపాటి మల్లిఖార్జున్, బాబురావు, పూర్ణచంద్రరావు , నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా టీకాతో అయస్కాంత శక్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కేంద్రం…

Drukpadam

చైనాలో కరోనా కల్లోలం.. 50 వేలకుపైగా కేసుల నమోదు!

Drukpadam

భారతీయులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన బ్రిటన్… ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్, జైరాం రమేశ్!

Drukpadam

Leave a Comment