Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

రాహుల్ కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు.. !

రాహుల్ కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు.. !

  • ఢిల్లీలో ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలో పాల్గొన్న ప్రియాంక
  • రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా రాజ్ ఘాట్ దగ్గర నిరసన
  • ట్రాఫిక్ ఇబ్బందులను కారణంగా చూపిస్తూ అనుమతివ్వని పోలీసులు
  • అనుమతిలేకున్నా వెనక్కి తగ్గని కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీపై పార్లమెంట్ లో అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వేటు అప్రజాస్వామికమని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆదివారం (ఈ రోజు) ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో నిరసన ప్రదర్శనలు చేపట్టింది.

ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో పోలీసులు ఈ దీక్షకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీక్ష కొనసాగిస్తోంది. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటూ పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు.

Related posts

ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి స్పందన!

Drukpadam

వైసీపీ రాజ్యసభ అభ్య‌ర్థుల‌ జాబితాలో లేని ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలు…

Drukpadam

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన దేశపతి….!

Drukpadam

Leave a Comment