సుష్మా స్వరాజ్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!
- ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కోకన్వీనర్‌గా బన్సూరీ స్వరాజ్ నియామకం
- లండన్‌లో న్యాయవిద్య అభ్యసించిన బన్సూరీ
- ప్రస్తుతం హరియాణా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా సేవలు
కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ సోమవారం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా తాజాగా నియమితులయ్యారు. ఉన్నత విద్యావంతురాలైన బన్సూరీ స్వరాజ్.. వార్‌విక్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చేశారు. అనంతరం.. లండన్ బీవీపీ లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.
రియల్ ఎస్టేట్, ట్యాక్స్, అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్లు, క్రిమినల్ కేసులు వాదిస్తున్న బన్సూరీ ప్రస్తుతం హరియాణా రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు. సుష్మా స్వరాజ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారా? లేదా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.