రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు
కరోనా కష్టకాలంలో కూడా రైతుకు అండగా నిలబడింది.కెసిఆర్
రైతు పండించే ప్రతి గింజనుకోంటాం..
రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం,
జడ్పీ చైర్మన్: లింగాల కమల్ రాజు
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని కాటలు వేయడం జరుగుతుంది. ఇప్పటికీ 60% ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
పోయిన వానాకాలం పంట మిల్లులో నిండి ఉండడం వలన యాసంగి ధాన్యాన్ని వేసుకోవడానికి షెడ్లు అన్ని నిండిపోయి ఉండటం వలన మిల్లర్స్ ఇబ్బంది పెట్టడం జరిగింది.
అందువలన జిల్లాలో కొనుగోలు కేంద్రాలు నిలిచి పోవడం జరిగింది.అట్టి విషయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది.దాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని మంత్రి గారు ఆదేశించడం జరిగింది.
మంత్రి గారి ఆదేశాల మేరకు కు నల్లగొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం రైస్ మిల్లు ఎక్కడా ఖాళీ ఉన్న దిగుమతి చేసుకోవాలని ఆర్డర్స్ జారీ చేయడమైనది.
ఇప్పటికే అన్ని కొనుగోలు కేంద్రాలనుండి కాటాలు వేయడం జరుగుతుంది.
కావున ధాన్యం పండించే రైతులు ఒక్కరోజు వెనుక ముందు ధాన్యం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులు అధైర్యపడవద్దు. భారతదేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
అయినా
మన రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రైతుని రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతులు పండించిన వరి ధాన్యాన్నిమొత్తాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
కావున రైతు పండించిన వరి గింజ ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
కావున రైతులు ఎవరు అధైర్యపడవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.