Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్: జగన్

దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్: జగన్

  • అంబేద్కర్ కు నివాళి అర్పించిన జగన్
  • ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అంబేద్కర్ అని ప్రశంస
  • అంబేద్కర్ సేవలను మరువలేమన్న ముఖ్యమంత్రి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దేశం గర్విచదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ అంబేద్కర్ అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి అని కొనియాడారు. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అని… వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని చెప్పారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు వేశామని అన్నారు.

కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తత్వానికి అంబేద్కర్ జీవితమే నిదర్శనం: కేసీఆర్

CM KCR paid tributes to Late Ambedkar on his 132nd birth anniversary
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా.. దేశ గమనాన్ని మార్చడంలో ఆయన సేవలను స్మరించుకున్నారు. శుక్రవారం ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్లు చేసింది.

‘‘ఏ ప్రయాణమైనా, ఎంత కష్టమైనా, ఎంత సుదీర్ఘమైనదైనా సరే.. చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో సాగితే గమ్యాన్ని చేరుకోవచ్చు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తత్వానికి అంబేద్కర్ జీవితమే నిదర్శనం’’ అని కేసీఆర్ పేర్కొన్నట్టు సీఎంవో ట్వీట్ చేసింది.

మరోవైపు ట్యాంక్ బండ్ తీరంలో నిర్మించిన 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. తొలుత శిలాఫలకం ఆవిష్కరించి, తర్వాత ఆడిటోరియం ప్రధాన భవనాన్ని ప్రారంభిస్తారు. విగ్రహావిష్కరణ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.

అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టాం.. చంద్రబాబు

Committed for Dalits welfare says Chandrababu

 

సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…  అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. అంబేద్కర్ గొప్పదనం భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతిలోని దళితులు ఎక్కువగా ఉన్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ… రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడే శ్రీకారం చుట్టామని తెలిపారు.

పేద విద్యార్ధులకు విదేశీ విద్యను అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పారు. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలు పెట్టే సంప్రదాయాన్ని తెచ్చామని అన్నారు. ఇకముందు కూడా అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

Related posts

శ్రీశైలం వద్ద రోప్ వే… ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం!

Drukpadam

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి…

Drukpadam

దుబాయ్ రాజు ఖరీదైన విడాకులు భరణంగా రూ.5,525 కోట్లు!

Drukpadam

Leave a Comment