Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గవర్నర్ తన విశేష అధికారాలతో టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

గవర్నర్ తన విశేష అధికారాలతో టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

  • టీఎస్ పీఎస్సీ లో పేపర్ లీకులు
  • కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరిన రేవంత్
  • గవర్నర్ నుంచి స్పందన లేదని వెల్లడి
  • తమ ఫిర్యాదు వల్లే ఈడీ రంగంలోకి దిగిందన్న టీపీసీసీ చీఫ్ 

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ను కోరామని, కానీ గవర్నర్ నుంచి స్పందన లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

టీఎస్ పీఎస్సీ లీక్ వ్యవహారంలో సిట్ చిన్న ఉద్యోగులను విచారించి చేతులు దులుపుకుందని, అయితే తాము చేసిన ఫిర్యాదు వల్లే ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగిందని అన్నారు.

టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను తాము ఇప్పటికే కోరామని వెల్లడించారు. టీఎస్ పీఎస్సీ పాలకవర్గాన్ని రద్దు చేసే ప్రత్యేక అధికారం గవర్నర్ కు ఉందని, గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించి టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

బండి సంజయ్ అత్తారింటి నుంచి వచ్చినట్టుగా ఉంది!

తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో జైలుకు వెళ్లిన బండి సంజయ్ ఏదో అత్తారింటి నుంచి వచ్చినట్టుగా జైలు నుంచి వచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలకు ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో జైలుకెళ్లిన బండి సంజయ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారంట అని రేవంత్ వ్యంగ్యం ప్రదర్శించారు.

Related posts

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!

Drukpadam

కొత్త గుర్తు తీసుకోండి …ఉద్ధవ్ థాకరేకి శరద్ పవార్ కీలక సూచన!

Drukpadam

కేంద్రం అనూహ్య నిర్ణయం…రిజూజీ నుంచి న్యాయశాఖ తొలగింపు …

Drukpadam

Leave a Comment