Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

షర్మిలకు అడుగడుగునా అవమానం అరెస్ట్ …జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

టీఎస్ పీఎస్ పేపర్ లీకేజి …సిట్ అధికారులను కలిసేందుకు షర్మిలకు ప్రయత్నం …అడ్డుకున్న పోలీసులు
షర్మిల అరెస్ట్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
పోలీసులతో వాగ్వివాదం …నేను ధర్నాకు గానీ , ముట్టడికి గానీ వెళ్లటంలేదన్న షర్మిల
నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్న షర్మిల
పోలిసుల నుంచి రాని సరైన సమాధానం…
హైదరాబాద్ లోని షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ విషయంలో సిట్ అధికారును కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కారులో ముందుకు వెళ్లేందుకు ఆమె యత్నించారు. ఈ క్రమంలో కారును చుట్టుముట్టిన పోలీసులు, డ్రైవర్ ను లాగి పడేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల కారు నుంచి కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టేస్తూ ముందుకు సాగేందుకు యత్నించారు. ఎస్సై, కానిస్టేబుల్ ను నెట్టేశారు.

ఈ క్రమంలో ఆమెను మహిళా పోలీసులు గట్టిగా పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలపై సెక్షన్ 330, 353 కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నట్టు కేసు బుక్ చేశారు.

షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన తల్లిని అడ్డుకున్న పోలీసులు.. వీళ్లకు చేతనైంది ఇదేనంటూ విజయమ్మ మండిపాటు

YS Vijayamma arguments with police

విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ను తోసేశారనే ఆరోపణలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన కూతురును పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు విజయమ్మ వచ్చారు. అయితే ఆమెను పోలీసులు స్టేషన్ లోపలకు అనుమతించలేదు. ఆమెను రోడ్డు పైనే ఆపేశారు.

ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తన కూతురును ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తనను స్టేషన్ లోపలకు ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. షర్మిలను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, షర్మిల గన్ మన్లను కొట్టడమే పోలీసులకు చేతనవుతుందని విజయమ్మ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించేందుకు సిట్ కార్యాలయానికి వెళ్తున్న షర్మిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. షర్మిలను కలిసేంత వరకు తాను ఇక్కడ నుంచి కదలనని చెప్పారు.

Related posts

వివేకానందరెడ్డి హత్యపై సమాచారమిస్తే రూ. 5 లక్షల నజరానా.. సీబీఐ పత్రికా ప్రకటన!

Drukpadam

ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శరీరంపై 500కుపైగా గాయాలు

Ram Narayana

అస్సాంలో కొనసాగుతున్న భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే!

Drukpadam

Leave a Comment