Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా ఉంది..పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్…

డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా ఉంది: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్…

  • దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే వారి జాబితా ఉందన్న కేసీఆర్
  • అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్న సీఎం
  • వ్యక్తిగత ప్రతిష్టలకు పోవద్దని ముఖ్యమంత్రి హితవు

దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని, ఆ ఎమ్మెల్యేలకు ఇదే తన చివరి వార్నింగ్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మరోసారి తప్పు చేస్తే పార్టీ నుండి తప్పిస్తామని స్పష్టం చేశారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోను ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీనియర్ నేత కడియం శ్రీహరిల మధ్య విబేధాలపై తీవ్రంగా స్పందించారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని చెప్పారు. నాయకులు ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోవద్దని, ఎలాంటి సమస్య ఉన్నా అధిష్టానంతో చెప్పి ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలన్నారు. దళిత బందుపై ప్రతిపక్షాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు.

అవసరమైతే టీవీ చానల్ నడపండి: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. మెరుగైన పని తీరు కనబర్చిన వారికే ఈసారి ఎన్నికల్లో టికెట్లు అని వెల్లడించారు. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి లేకుండా చూడాలని అన్నారు.

పార్టీ కోసం అవసరమైతే టీవీ చానల్ నడపాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి పార్టీ శ్రేణులే టీవీ ప్రకటనలు, ఫిల్మ్ ప్రొడక్షన్ చేపట్టవచ్చని వివరించారు. ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాలను భారీ ఎత్తున ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.

నిత్యం ప్రజల్లో ఉండడం అనేది చాలా ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు.  దాహం వేసినప్పుడే బావి తవ్వుకుంటాం అనే ధోరణి ఇప్పటి కాలం రాజకీయాలకు సరిపోదని అన్నారు.

Related posts

షర్మిల జెండా ఎత్తి వేస్తున్నారా …? కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నారా …??

Drukpadam

అంబేద్కర్ విశ్వమానవుడు … ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం …సీఎం కేసీఆర్

Drukpadam

అక్క కోసం రంగంలోకి దిగిన చెల్లి

Drukpadam

Leave a Comment