Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తక్షణమే రఘురామను ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశం…

తక్షణమే రఘురామను  ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు ఆదేశం…
రఘురామ వైద్య పరీక్షల నివేదికపై హైకోర్టులో వాదనలు పూర్తి
సీఐడీ కోర్టు ఆదేశాలు అమలు చేయాలన్న హైకోర్టు
రమేశ్ ఆసుపత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు చేపట్టాలని ఉత్తర్వులు
ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట కలిగింది. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామను తక్షణమే రమేశ్ ఆసుపత్రికి పంపాలని స్పష్టం చేసింది. ఈ సాయంత్రం హైకోర్టులో రఘురామ వైద్య పరీక్షల నివేదికపై విచారణ జరిగింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్… రఘురామ తరఫు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

కాగా, రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు విన్నవించారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటు, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రస్తావించారు. కొద్దిసేపటి క్రితమే వాదనలు పూర్తి కాగా, ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను అమలు పర్చాలని ఆదేశించింది

అంతకు ముందు అత్యంత నాటకీయపరిణామాల మధ్య రఘురామాను గుంటూరు జిల్లా జైలుకు తరలించి రిమాండ్ ఖైదీగా నెంబర్ కేటాయించారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడం తెలిసిందే. రఘురామకృష్ణరాజుకు రిమాండ్ ఖైదీ నెంబరు 3468 కేటాయించారు. ఆయనను జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్ లో ఉంచారు.

కాగా, రఘురామకృష్ణరాజుపై తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబే రఘురామకృష్ణరాజు వెనుక ఉండి ప్రభుత్వం, సీఎం జగన్ పై కుట్రలకు పాల్పడ్డారని శ్రీనివాసులు ఆరోపించారు.

Related posts

Helen Mirren’s MUA Reveals Her 9 Best Tips for Wearing Makeup Over 50

Drukpadam

టీఆర్ఎస్ ఆందోళ‌న‌ల‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు…

Drukpadam

తనను అమ్మాయిలు ఇష్టపడటం లేదు … నాకో అమ్మాయిని చూసి పెట్టండి ఎమ్మెల్యేకి యువకుడి లేఖ!

Drukpadam

Leave a Comment