Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

దూరం …దూరం కాంగ్రెస్ బీజేపీ లకు సమాన దూరం …నవీన్ పట్నాయక్ …!

కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటిస్తాం.. నవీన్ పట్నాయక్
థర్డ్ ఫ్రంట్‌లో చేరడం లేదు
మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన నవీన్
ప్రధానితో 20 నిమిషాల పాటు భేటీ
తమ విధానంలో మార్పు ఉండబోదన్న సీఎం

ఐదుసార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన నవీన్ పట్నాయక్ శైలే వేరు ఆయన దేశ రాజకీయాల్లో తనదైన దారిలో వెళుతుంటారు .కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న దానికి అంశాలవారీగా మద్దతు ఇస్తూనే తన రాష్ట్రంలో తిరుగులేకుండా గత 23 సంవత్సరాలకు పైగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు .వివాదరహితుడిగా ఆయనకు పేరుంది . మితభాషి , మృదు స్వభావి అంతకు మించి మానవతా విలువలు తెలిసినవాడు…అందువల్లనే ఒడిశా రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలుగా పాలిస్తున్నాడు . పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాది కాలం ఉండటంతో తన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు .

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ బీజేపీని గద్దెదింపేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటివారు తాము కాంగ్రెస్-బీజేపీలకు సమాన దూరం పాటిస్తామని, థర్డ్ ఫ్రంట్‌లో చేరే ఆలోచన లేదని చెబుతూ వస్తున్నారు. తాజాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఇదే చెప్పారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, కాబట్టి తృతీయ కూటమి (థర్డ్ ఫ్రంట్)లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన నిన్న సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. వారి మధ్య 20 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. అనంతరం నవీన్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బిజూ జనతా దళ్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. కాంగ్రెస్-బీజేపీకి సమాన దూరం పాటించాలన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కూటమి గురించి తాను చర్చించలేదని పేర్కొన్నారు.

Related posts

జేపీ నడ్డాకు సమాధి…వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి!

Drukpadam

కంచుకోటలో కంగుతిన్న ఎస్పీ …రీపోలింగ్ కు అఖిలేష్ డిమాండ్ …

Drukpadam

సాగర్ బరిలో సానుభూతికే కేసీఆర్ మొగ్గు

Drukpadam

Leave a Comment