Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి …

చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా: ఆనం రామనారాయణ రెడ్డి

  • ఎంపీగా కాదు.. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానన్న ఆనం
  • ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా
  • ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి 60 శాతం మంది చేరతారని వ్యాఖ్య

వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్ అయింది .ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దపడగా ఇప్పుడు సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి ఆయన దారిలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేత చంద్రబాబు నిర్ణయమేరకు నడుచుకుంటానని తెలిపారు . పార్టీ ఆయన్ను మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిలకు సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో సస్పండ్ చేసింది. ఇదే జిల్లా నుంచి మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేశారు . ఇప్పుడు ఈ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెపుతున్నారు . మొదటి నుంచి వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న జిల్లాల్లో నెల్లూరు మొదటి స్థానంలో ఉంది . ఇప్పడు అక్కడ పరిస్థితి బాగాలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ఆనం స్పందించారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి 60 శాతం మంది వైసీపీ నుంచి చేరతారని అన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పనుల కోసం చాలా మంది ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.

Related posts

బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పువ్వాడ అజయ్!

Drukpadam

అమూల్ రెడ్డి సంగం డైరీలో మొక్కకూడా పీకలేక పోయారు;నారా లోకేష్…

Drukpadam

మంచిర్యాల జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్షకు షాక్ …

Drukpadam

Leave a Comment