ఈ దుబాయ్ గృహిణి రోజువారీ ఖర్చు రూ.70 లక్షలు!
- దుబాయ్ కుబేరుడు జమాల్ బిన్ నాదక్ అర్ధాంగి సౌదీ
- షాపింగ్, తిండి, ప్రయాణాలు ఆమె హాబీలు
- మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేసే ఖరీదైన గృహిణి
కోటీశ్వరుడి భార్య అయితే డబ్బుకు కొదవేముంటుంది! ఈ దుబాయ్ గృహిణి వైభోగం చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఆమె పేరు సౌదీ. దుబాయ్ సంపన్నుడు జమాల్ బిన్ నాదక్ అర్ధాంగి. ఆమెకు షాపింగ్ చేయడం ఒక హాబీ.
హాబీలు ఉండడం పెద్ద విషయమేం కాదు. కానీ సౌదీ ప్రతిరోజు షాపింగ్, తిండి, ప్రయాణాల కోసం కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే అయ్య బాబోయ్ అంటారు. అక్షరాలా రూ.70 లక్షలే. ఆమె లగ్జరీకి ఆకాశమే హద్దు. ఆమె వాడే ప్రతి వస్తువు అత్యంత ఖరీదైనదే. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, కళ్లు చెదిరే కార్లు, విలాసవంతమైన ప్రదేశాలు… ఇలా ఉంటుంది ఆమె రోజువారీ వ్యవహారం.
భర్తతో కలిసి ఆమె ప్రపంచ యాత్రలు చేస్తుంటుంది. అన్నట్టు… సౌదీకి టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సౌదీ తన ఖరీదైన జీవితానికి సంబంధించిన వీడియోలతో అలరిస్తుంటుంది. ఏదో పక్క ఊరికి వెళుతున్నట్టు సౌదీ, ఆమె భర్త జమాల్ తరచుగా లండన్ వెళ్లొస్తుంటారు. ఇటీవలే భూతల స్వర్గం లాంటి మాల్దీవులు, సీషెల్స్ కూడా వెళ్లొచ్చారు. వీళ్లిద్దరూ కూడా తగినవారే. తమ దుస్తులు, యాక్సెసరీస్ కు మ్యాచింగ్ అయ్యే కార్లను ఉపయోగిస్తుంటారు.