Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్…

రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్…
రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు
రేవంత్ పార్టీ ఎలా నడుపుతున్నారో కాంగ్రెస్ సీనియర్లను అడిగితే తెలుస్తుందని ఎద్దేవా
ఓటుకు నోటు తరహాలో డబ్బులు పంచడం తనవల్ల కాదని పరోక్ష వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి పై బండి విమర్శలు ఆసక్తిగా మారాయి. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్ ఎక్కడుంది అని అన్న బీజేపీనేతలకు కర్ణాటక షాక్ తగలడంతో కాంగ్రెస్ పై విమర్శలకు పదును పెట్టారు . రేవంత్ ను టార్గెట్ గా బండి సంజయ్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ను బలహీన పరచాలనే ఉద్దేశంతో తమపై అటాక్ చేస్తుందని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయ పడ్డారు .

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ ఎలా నడుపుతున్నారో జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓటుకు నోటు కేసు తరహాలో డబ్బులు పంచడం తనవల్ల కాదని చురక అంటించారు.

తాము హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచామని, పార్టీ నడపడం రాకుంటే ఎలా గెలుస్తామని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ గెలుపు ఒరవడిని కొనసాగిస్తుంటే, కాంగ్రెస్ ఓటమి పరంపర కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావడంలేదని విమర్శించారు. బీజేపీలో సీనియర్లు బాస్ లు అని, కాంగ్రెస్ లో హోంగార్డులని విమర్శించారు.

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షడ్యూల్ విడుదల -అక్టోబర్ 17 ఎన్నిక…

Drukpadam

శశికళతో బీజేపీ నేత విజయశాంతి భేటీ.. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందన్న నటి!

Drukpadam

కొంపదీసి యుద్ధ ట్యాంకుల్ని కూడా మమ్మల్నే కొనుక్కోమనరుగా: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

Leave a Comment