Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నియోజకవర్గాల పునర్విభజన …పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపు నార్త్ ,సౌత్ పంచాయతీ ….

నియోజకవర్గాల పునర్విభజన …పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపు నార్త్ ,సౌత్ పంచాయతీ ….
-పెరగనున్న నార్త్ ప్రాతినిధ్యం …తగ్గనున్న సౌత్ ప్రాభల్యం …
-ప్రభుత్వం చెప్పినట్లు జనాభా నియంత్రణ చేసినందుకు సౌత్ ఇండియా కు శిక్షా…!
-కేంద్రం మార్గదర్శకాలు పాటించని నార్త్ ఇండియా కు మేలు
-భగ్గుమంటున్న సౌత్ ఇండియా రాష్ట్రాలు
-ఇది కచ్చితంగా పక్షపాతమని విమర్శలు
-దక్షణాది రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పాలని బీఆర్ యస్ నేత కేటీఆర్ పిలుపు ..

మన రాజ్యాంగం ప్రకారం ప్రతి 20 సంవత్సాలు ఒకసారి దేశంలో లోకసభ ,రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభనన జరుగుతుంది. అంటే నియోజవర్గాల సరిహద్దులు , రిజర్వేషన్ లు మారుతుంటాయి. డీలిమిటేషన్ చట్ట ప్రకారం 2026 లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ లో సరిహద్దుల మార్పులే కాకుండా సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ సీట్ల పెంపుపై హింట్ ఇచ్చారు . లోకసభలో ఇప్పుడు 543 సీట్లు ఉండగా వాటిని 848 సీట్లకు పెంచనున్నారని వార్తలు వస్తున్నాయి. పెరిగే సీట్లకు అనుగుణంగా దూరదృష్టితో కొత్త పార్లమెంట్ లో సీట్ల సంఖ్య పెంచారు . 2002 లోనే సీట్ల సంఖ్య పెరగాల్సి ఉన్నప్పటికీ దేశంలో వివిధ ప్రాంతాల్లో జనాభా హెచ్చుతగ్గులు , కొన్ని ప్రాంతాల్లో జనాభా నియంత్రణ జరిగినప్పటికీ మరి కొన్ని ప్రాంతాలూ నియంత్రణ జరగక పోవడంతో జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభనలో కొన్ని ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

అయితే ఇది నార్త్ ,సౌత్ ఇండియా ల మధ్య తగాదాకు దారితీసే విధంగా ఉంది.ఇప్పటికే అన్ని రంగాల్లో ముందుండి , 18 శాతం మాత్రమే జనాభా కలిగిన దక్షణాది రాష్ట్రాలు 35 శాతం స్థూల జాతీయ ఉత్పత్తికి నిధులు సమకూర్చుతున్నాయి. అయినప్పటికీ దక్షణ భారతంపై కేంద్రం వివక్ష చూపుతుందని వస్తున్న విమర్శల నేపథ్యంలో సీట్లు పెంపు కొత్త పంచాయతీకి దారితీసేదిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీట్ల పంపు జనాభా ప్రాతిపదికన జరగాల్సి ఉంది. అయితే కేంద్రం జనాభా పెంపును అరికట్టేందుకు 1970 వ దశకంలోనే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాలను సౌత్ ఇండియా లో ఉన్న రాష్ట్రాలు తూచా తప్పకుండ పాటించాయి. దీంతో ఇక్కడ జనాభా బాగా తగ్గింది…పెరగకుండా కాంట్రొల్ చేయగలిగారు . కానీ ఉత్తర భారతంలోకేంద్రం మార్గదర్శనాలు పాటించని కారణంగా జనాభా బాగా పెరిగింది జనాభా విస్ఫోటనం జరిగింది. కేంద్ర సూచనలు పాటించిన దక్షిణాదికి అన్యాయం జరగనుండగా , కేంద్ర మాట వినకుండా ఉన్న ఉత్తర భారత దేశానికి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్తర భారత దేశంలో ఉన్న రాష్ట్రాలలో లోకసభ సీట్ల సంఖ్య భారీగా పెరగనుండగా సౌత్ లో తగ్గనున్నాయి. కేరళ లాంటి రాష్ట్రంలో పకడ్బందీగా కుటుంబనియంత్రణ అమలు జరపడంతో జనాభా పెరగలేదు… అందువల్ల ఆరాష్ట్రంలో అసలు సీట్లు పెరగటం లేదు ప్రస్తుతం ఉన్న 20 లోకసభ సీట్లు 20 గానే ఉండనున్నాయి . …దీనిపై విపక్షాలు ప్రధానంగా దక్షణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలు ఈ వివక్షపై భగ్గుమంటున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై ఘాటుగా స్పందించారు .”ఇది అసంబద్ధమైన డీలిమిటేషన్ అవుతుందని ,దక్షణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు .దీనిపై దక్షణాది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా తమ గొంతు వినిపించాలని పిలుపు నివ్వడం గమనార్హం”….

ఇప్పుడు లోకసభలో 543 నియోజవర్గాల నుంచి సభ్యులు ఎన్నిక అవుతున్నారు . డీలిమిటేషన్ జరిగితే ఈ సంఖ్య 848 సీట్లకు పెరగనున్నదని అంచనా అంటే 305 లోక సభ సీట్లు పెరగనున్నాయి. ఇవి ఎక్కడ నుంచి పెరుగుతున్నాయంటే ఉత్తరాదినే ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం 80 సీట్లు ఉండగా అవి పెరుగుదల కారణంగా 143 అవుతాయి. అంటే 63 సీట్లు ఒక్క యూపీ లేనే పెరుగుతాయన్న మాట …ఇక బీహార్ లో 40 సీట్లు ఉండగా అవి 79 కానున్నాయి. అంటే 39 పెరుగుతాయి. ఇక రాజస్థాన్ 25 నుంచి 50 ,మధ్యప్రదేశ్ 29 నుంచి 52 ,మహారాష్ట్ర 48 నుంచి 76 ,పశ్చిమ బెంగాల్ 42 నుంచి 60 ,సీట్ల వరకు పెరగ నుండగా దక్షిణాదిన ఉన్న తమిళనాడు లో 39 నుంచి 49 ,ఏపీ లో 25 నుంచి 31 ,తెలంగాణ లో 17 నుంచి 23 , కర్ణాటకలో 28 నుంచి 41 ,సీట్లు మాత్రమే పెరగ నున్నాయి. ఇక కేరళ లో ఉన్న 20 సీట్లలో ఎలాంటి మార్పు ఉండదు …

అంటే ఉత్తరాదిన కేవలం యూపీ ,బీహార్ లలో 102 సీట్లు 85 శాతం ,పెరుగుదల ఉండగా , దక్షిణాదిన కేవలం 36 సీట్లు అంటే 28 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. ఇక ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం 294 సీట్లు ఉండగా 167 సీట్లు పెరగ నున్నాయి ..అంటే 57 శాతం …దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ అసమానతలు తొలగించి సీట్ల పెంపుదలలో దక్షిణాదికి న్యాయం జరిగేలా చూడాలని అందుకు దక్షిణది రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా తమ గొంతు వినిపించాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో ….

Related posts

మీ గురించి వాస్తవాలు చెపితే ఉరేసుకుని చస్తారు: చంద్రబాబుపై అంబటి విమర్శలు!

Drukpadam

పవన్ కళ్యాణ్ కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ …

Drukpadam

పంజాబ్ సీఎం అభ్యర్థి విషయమై టెలిపోల్ ప్రారంభించిన కాంగ్రెస్!

Drukpadam

Leave a Comment