Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

2.37 లక్షల బైకులను వెనక్కి పిలిపిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్… కారణం ఇదే!

2.37 లక్షల బైకులను వెనక్కి పిలిపిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్… కారణం ఇదే!
  • బైకుల్లో సాంకేతిక లోపం గుర్తింపు
  • ఇగ్నిషన్ కాయిల్ లోపభూయిష్టం
  • బుల్లెట్, మెటియోర్, క్లాసిక్ బైకుల రీకాల్
  • ఇది చాలా అరుదైన లోపమన్న రాయల్ ఎన్ ఫీల్డ్

భారీ మోటార్ సైకిళ్లకు పెట్టింది పేరైన రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఇప్పటికే అమ్ముడైన పలు మోడళ్లను వెనక్కి పిలిపిస్తోంది. ఇగ్నిషన్ కాయిల్ లో లోపాలు ఉన్నాయన్న కారణంతో 2,36,966 బైకులను కంపెనీ షోరూంలకు తిరిగి రప్పిస్తోంది. ఇగ్నిషన్ కాయిల్ లోపం కారణంగా మోటార్ సైకిళ్లలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. బుల్లెట్, క్లాసిక్, మెటియోర్ మోడళ్ల బైకుల్లో ఈ లోపాలు ఉన్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మోడళ్లను భారత్ తో పాటు, థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో విక్రయించామని, వాటిని వెనక్కి పిలిపిస్తున్నామని రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది చాలా అరుదైన లోపం అని పేర్కొంది.

అయితే, 2020 డిసెంబరు నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో తయారైన అన్ని బైకుల్లో ఈ లోపం ఏర్పడినట్టు చెప్పలేమని వివరించింది. వెనక్కి రప్పిస్తున్న మోటార్ సైకిళ్లలో 10 శాతం కంటే తక్కువ బైకులకు మాత్రమే ఇగ్నిషన్ కాయిల్ రీప్లేస్ మెంట్ అవసరం అవుతుందని భావిస్తున్నామని తెలిపింది

Related posts

రేపు భద్రాచలంకు కేసీఆర్….

Drukpadam

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

Drukpadam

పాద యాత్రలో సాధారణ జీవితం: బండి సంజయ్

Drukpadam

Leave a Comment