Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ పై టీఆర్ యస్ ఎదురుదాడి

కాంగ్రెస్ నాయకులవి అవగాహన రాహిత్య వ్యాఖ్యలు

భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలల మంజూరు

కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు

ప్రజా సంక్షేమమే పువ్వాడ లక్ష్యం

లింగాల, బాలసాని,

కాంగ్రెస్ నాయకులు పరిస్థితులపై,సమస్యలపై కనీస అవగాహన లేకుండా పత్రికా ప్రచారం కోసం ప్రభుత్వం పై,మంత్రి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ,ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ లు మండి పడ్డారు.పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగాణా భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం గిరిజన ప్రాంతాల్లో ఆరు మెడికల్ కళాశాల లను మంజూరు చేసిందన్నారు. దీని వల్ల గిరిజన ప్రాంతాల్లో అధికంగా ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేసుకోవచ్చునన్నారు. తద్వారా ఏజన్సీలో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా హర్షిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వారు మాత్రం కనీస అవగాహన లేకుండా మంత్రిపై, ఆయన వ్యాపారాలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రోగులకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచి అనునిత్యం పర్యవేక్షిస్తున్న వ్యక్తి పువ్వాడ అజయ్ అన్నారు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఖమ్మంకు కళాశాల రాకుండా మంత్రి అడ్డుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల ధ్వజమెత్తారు. కోవిడ్ విషయంలో గతంలో వైద్యశాలలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీని తమ చేతిలో ఉంచుకొని తెలంగాణా కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందన్నారు. అదేవిధంగా రేమిడీస్ కి కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా కోవిడ్ నియంత్రణ కోసం ఆయా కంపెనీలతో చర్చించి అన్నిరకాల సేవలను రోగులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దీన్ని చూసి తట్టుకోలేక అవాకులు, చేవాకులు పెళుతున్నారన్నారు. తాము కోవిడ్ నియంత్రణకు భట్టి మాదిరి వ్యవహరించకుండా మంత్రి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పలు మార్లు ప్రజాప్రతినిధిగా ఉండీ కూడా మధిర ఆసుపత్రిని బాగు చేయించుకోలేని ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Related posts

తలుపులకు ఇష్టమొచ్చిన రంగు వేసినందుకు..19 లక్షల జరిమానా!

Drukpadam

పీవోకే పై భారత్ కలలు కల్లలే: పాక్ ఆర్మీ చీఫ్!

Drukpadam

కర్ణాటక ఎన్నికలు …చెట్లపై డబ్బులు ….!

Drukpadam

Leave a Comment