Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కరోనా సంక్షోభంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

కరోనా సంక్షోభంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 47 మంది తెలుగు వైద్యుల లేఖ

దేశంలో కరోనా సంక్షోభం మీద తెలుగు ప్రగతిశీల వైద్యుల బృందం బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసింది. దేశంలో నానాటికీ కరోనా విజృంభణ పెరిగిపోవడానికి.. సెకండ్ వేవ్ కు అధికారులు, నాయకులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని చెబుతూ.. దీని నివారణకు, కట్టడికి తీసుకోవాల్సిన కొన్ని సలహాలు, సూచనలు పొందుపరిచారు. ఆ లేఖ.. ఈ క్రింద యధాతథంగా మీ కోసం…

శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ , సుప్రీంకోర్టు , ఇండియా గారికి,

*విషయం : ఇండియాలో కరోనా వైరస్ సంక్షోభం గురించి…

సర్,
మేము ప్రగతిశీల డాక్టర్లుగా మన దేశంలో కోవిద్-19 వల్ల తలెత్తిన పరిస్థితి మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.
మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిద్ -19 రెండో ప్రళయాన్ని అధిగమించడంలో విఫలం అయ్యాయి. ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన మూలంగా దేశంలో కోవిద్ కేసులు విపరీతంగా పెరిగాయి. కోవిద్-19 మొదటి వేవ్ అదుపులోకి రాకముందే ప్రభుత్వాలు మత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే కూడా సిబ్బంది నియామకం, ఆక్సిజన్ సరఫరా, బెడ్ల పెంపుదల, మెడిసిన్ అందుబాటులోకి తేవడం లాంటి వాటి గురించి ప్రభుత్వాల దగ్గర కనీస కార్యక్రమం లేదు. కోవిద్-19 రెండవ వేవ్ వస్తుందని ఊహాగానాలు ఉన్నప్పటికీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వేవ్ ని ఎదుర్కోడానికి సిద్ధం కావడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
ఈ మహమ్మారి భయంకరమైన ప్రభావంతో రోజుకి 1500 నుండి 3000 మరణాలు సంభవించాయి. దేశంలో ఏప్రిల్ 15 నుండి ప్రతి రోజు 2 లక్షల కేసులు నమోదు అవుతూ ఏప్రిల్ 27 నాడు 3 లక్షల 60 వేల 960 తో ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదైన దేశంగా ఘనతకెక్కింది.

దేశంలో కోవిద్-19 కేసుల సంఖ్య వరుసగా ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, ఇది సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు , డిసెంబర్ 19న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4న భారత్ 2కోట్ల మైలు రాయిని దాటింది.

తప్పుడు లెక్కలు చూపించడానికి ఉత్తరప్రదేశ్ లో శవాలను నదుల్లోకి విసిరివేస్తున్నారు. మేము మీడియాలో చూసిన దాని ప్రకారం గంగా , యమునా నదుల్లో శవాలు తేలుతున్నాయి.
చాలా తక్కువ సంఖ్యలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా కొరత ఉన్నాయి. కోవిన్ అప్లికేషన్లో టీకా వేపించుకోటానికి సమయం కేటాయించబడటం లేదు. మొదటి డోసు ఇచ్చిన వారికి రెండో డోసు దొరకని పరిస్థితి ఉన్నది.

వ్యాక్సిన్ల కొరకు వెళ్లి కోవిద్ బాధితులుగా తిరిగివస్తున్న వైనం కనిపిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, టీకా ఇచ్చే కేంద్రాలు రెండు ఒకే చోట ఉండటం ప్రధాన కారణం. ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ ప్రాథమిక బాధ్యతలను , విధులను గాలికి వదిలేసి ప్రజల బాధలను తగ్గించడానికి ఏ మాత్రం కూడా కృషి చెయ్యట్లేదు.

మరణాల రేటు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కోవిద్-19 లింకును అడ్డుకోటానికి సిద్ధంగా లేవు. గణాంకాల ప్రకారం వైద్య సిబ్బంది సరిపడినంత లేరు, ఇప్పుడున్న వారితో రోగులకు చికిత్స చేయటం కష్టంతో కూడుకున్నది. తక్షణమే వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలి. కోవిద్-19 మహమ్మారి తీవ్రతరం కావటానికి ప్రధాన కారణం పాలకులు వైఫల్యమే.

ఆ వైఫల్యాలను అధిగమిస్తూ సమస్యకు పరిష్కార మార్గాలు చేపట్టాలి. దేశంలోని ప్రజలకు పెద్ద సంఖ్యలో వైరస్ సంక్రమిస్తుంది తత్ఫలితంగా మరణాలు కూడా తీవ్ర స్థాయిలో సంభవిస్తున్నాయి. తగిన సమయంలో ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు ఇవ్వటానికి నిర్ణిత సమయంలో కొనుగోలు చేయడంలో/ ఆర్డర్ ఇవ్వడంలో విఫలం అయింది.

ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తూ చానా కాన్షస్ గా ప్రజోపయోగం లేని ప్రాజెక్టులకు డబ్బులు కేటాయిస్తోంది. ఆ సంక్షోభంలో కూడా మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రతినిధులు ఎం.పి , ఎం.ఎల్.ఏ, మంత్రులు అశాస్త్రీయ భావజాలాన్ని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కోవిద్-19 సంక్రమించకుండా, బాధితులు ఉపశమనం పొందాలంటే ఆవు మూత్రం త్రాగాలని , ఆవు పేడ మర్దన చేయాలని బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A[h] లో ప్రతి పౌరుడిలో సైంటిఫిక్ టెంపర్ అభివృద్ధి చేయడం కర్తవ్యంగా పేర్కొంటుంది. లౌకిక వాదం, మానవతా వాదం, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి సైంటిఫిక్ టెంపర్ సహాయ పడుతుంది. దీని ప్రకారం అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం శిక్షించాలి.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని, ఈ క్రింది అవసరాలు నెరవేర్చేలా చేయాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

1.ఈ సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలి.

  1. యుద్ధ ప్రాతిపాదికన అన్ని ఆసుపత్రులను జాతీయం చేయాలి.
  2. కార్పొరేట్ మాఫియాను అరికట్టాలి.
  3. ప్రతి మండలానికి 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలి.
  4. ప్రభుత్వ ఖర్చులతోనే అంబులెన్సు సర్వీసులను కొనసాగించాలి.
  5. పూర్తీ స్థాయిలో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాలి.
  6. కరోనా బాధితులతో పాటుగా ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలి.
  7. పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి.
  8. కోవిద్-19 పరీక్షా కేంద్రాలు మరియు వ్యాక్సిన్ కేంద్రాలు వేర్వేరు చోట్ల నిర్వహించాలి.
  9. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలి.
  10. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలి.
  11. కోవిద్-19 రెండవ వేవ్ ని నియంత్రిస్తూ ,దేశాన్ని మూడో వేవ్ లోకి వెళ్లకుండా శాస్త్రీయ నిర్ణయాలు చేయాలి. ప్రజల ప్రాణాలు రక్షించాలి.
  12. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కనీసం 10 శాతం వైద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాలి. కోవిడ్ పా౦డేమిక్ లాంటి విపత్తులకు ప్రత్యేక౦గా అవసరమైన నిధులను తక్షణం విడుదల చేయాలి.

ధన్యవాదాలతో,
ప్రోగ్రెసివ్ డాక్టర్స్..
1.డా. కాసుల లింగా రెడ్డి

  1. డా.ఎస్. అజిత
  2. డా.అన్వేష్
  3. డా.అవని
  4. డా.భక్తవత్సలరావు
  5. డా.చంద్రశేఖర్
  6. డా.దేశమ్
  7. డా.హర్షవర్ధన్ రెడ్డి
  8. డా.జగదీశ్వర్
  9. డా.జయసూర్య
  10. డా.కె. గౌతమ్
  11. డా.మధుసూదన్ రెడ్డి
  12. డా.మూర్తి
  13. డా.నలిని
  14. డా.రఫి
  15. డా.వి.సుబ్బా రెడ్డి
  16. డా.మేకల ఇన్నారెడ్డి
  17. డా.తిరుపతయ్య
  18. డా.విజయ కుమార్
  19. డా. శిరీష
  20. డా.తిరుపతి
  21. డా.గోపాల్ రెడ్డి
  22. డా.గోపీనాథ్
  23. డా.రాంగోపాల్
  24. డా.సాహితి
  25. డా.సంతోష్
    27.డా.పెంచలయ్య
    28.డా. రాజశేఖరరెడ్డి
    29.డా. రణధీర్
    30.డా.రంగారెడ్డి
    31.డా.సాహస
    32.డా.శ్యాం సుందర్
    33.డా.శ్రీభూషణ్ రాజు
    34.డా.స్వామి
    35.డా.వంశీధర్ రెడ్డి
    36.డా.విజయకుమార్
    37.డా. విరించి విరింటి
    38.డా. వివేక్
    39.డా.శ్రీనివాస్ ప్రసాద్
    40.డా.సి.హెచ్ రాజమౌళి
  26. డా.చెన్నయ్య
    42.డా.మధుశేఖర్
    43.డా.రాం మోహన్
    44.డా.వెంకటేశం
  27. డా. చంద్రశేఖర్
    46.డా. చైతన్య చెక్కిళ్ళ
    47.డా.శ్రీనివాస్ నళిని

Related posts

నిపుణులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న కెనడా

Drukpadam

ఇండియా పాస్ పోర్ట్ తో వీసా అవసరం లేకుండా 60 దేశాలకు వెళ్ళవచ్చు !

Drukpadam

పొంగులేటిని రాహుల్ టీమ్ కలిసిందా….?

Drukpadam

Leave a Comment