Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రి హరీష్ రావు కు కీలక భాద్యతలు….?

మంత్రి హరీష్ రావు కు కీలక భాద్యతలు….?
-హుజురాబాద్ ఆపరేషన్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ
-ఈటలతో ఉన్న సాన్నిహిత్యమే కారణమా ?
-అందుకే తన మిత్రుడికే ఇంచార్జి ఇచ్చారని ఈటల వ్యాఖ్య
-హుజురాబాద్ ఆపరేషన్ లో హరీష్ రావు భుజం మీద తుపాకీ
తెలంగాణ కాబినెట్ లో కీలక మంత్రి ట్రబుల్ షూటర్ గా పేరున్న తన్నీరు హరీష్ రావు కు హుజురాబాద్ ఆపరేషన్ భాద్యను అప్పగించినట్లు సమాచారం. సుదీర్ఘకాలం ఈటలతో ఉద్యమ సహచరుడిగా ఉన్న హరీష్ రావు అయితేనే హుజురాబాద్ లో తమపని తేలికవుతుంది కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు భుజాన తుపాకీ పెట్టి హుజురాబాద్ ఆపరేషన్ సక్సెస్ చేయాలనే వ్యూహం తో ఉన్నారని పరిశీలకుల అభిప్రాయం. కేసీఆర్ కు రాజకీయ చాణిక్యుడిగా పేరుంది. ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పక్క ప్లాన్ తో నిర్ణహిస్తారు . మొదటి నుంచి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు గురించి తెలిసిన వారు ఎవరైనా కేసీఆర్ ఎప్పుడు ఏమి చెపుతారో అర్థం కాదు. అందులో మంత్రులు కూడా మినహాయింపు కాదు. హరీష్ రావు ను ఒకప్పుడు పక్కన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లనే ఆయన నేరుగా ప్రగతి భవన్ నుంచే హుజారాబాద్ వ్యవహారాలను చూస్తున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన ఈటల చూస్తున్న వైద్యఆరోగ్య శాఖను కూడా హరీష్ రావుకు అప్పగించే ఆవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆ శాఖకు సంబందించిన వ్యవహారాలను హరీష్ రావు చూస్తూ సమీక్షలు జరుపుతున్నారు. దీనితో పాటు హుజురాబాద్ ఆపరేషన్ భాద్యలతో హరీష్ రావు పూర్తీ బిజీ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. గంగుల కమలాకర్ తో నిత్యం టచ్ లో ఉంటూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. హుజారాబాద్ పై టీఆర్ యస్ గురి పెట్టడంతో ఈటల కూడా తనదైన శైలిలో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఇద్దరు సీనియర్ ఉద్యమకారుల మధ్య ఇది యుద్ధంగా మారుతుందా అనే అభిప్రాయాలూ కూడా కలుగుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ కు హుజురాబాద్ లో గట్టి పెట్టె ఉంది. కాకపోతే ఆ పట్టుని దెబ్బగొట్టాలని టీఆర్ యస్ అధిష్టానం వ్యూహంగా ఉంది. అందుకు రంగంలోకి దిగిన పార్టీ గంగుల కమలాకర్ కు భాద్యతలు అప్పగించింది. ఆయన నియోజకవర్గంలో ఉన్న జడ్పీటీసీ ,ఎంపీపీ , మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతర నేతలను కరీంనగర్ పిలిపించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీకి మద్దతుగా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో హుజురాబాద్ ,కమలాపూర్ మండలాల వారు ఉన్నారు.జమ్మికుంట , వీణవంక ప్రజాప్రతినిధులు మాత్రం ఈటల వెంటే ఉంటామని మీడియా సమావేశాలు పెట్టి వెల్లడించారు. అయితే వారిని కూడా పార్టీ కు అనుకూలంగా మార్చాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు. టీఆర్ యస్ ఎత్తులను పసి గట్టిన ఈటల హుటాహుటిన హుజారాబాద్ చేరుకొని కార్యకర్తలని కలిశారు. మీడియా సమావేశం లో గంగులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిడ్డ నీ జాతకం అంతా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు. 2023 నువ్వు ఉండవ్ నీ అధికారం ఉండదు .గుర్తు పెట్టుకో అంటూ ఘాటైన పదజాలంతో ఫైర్ అయ్యారు. దానికి ప్రతిగా గంగుల కూడా ఈటలపై భగ్గుభగ్గు మన్నారు. ఆయన నువ్వు ,అని సంభోదించిన సంస్కారం తో మీరు అని సంభోదిస్తున్నట్లు పేరుకొన్నారు. ఆత్మగౌరవాన్ని గురించి నిరంతరం మాట్లాడే ఈటల ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడంలేదని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. ఈటల తాను మంత్రి అయినా దగ్గర నుంచి ఇంతవరకు తనతో మాట్లాడలేదని తమమధ్య ఉన్న విభేదాలను బయట పెట్టారు. మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన తరువాత మే 3 హుజురాబాద్ వచ్చిన ఈటల తిరిగి 15 రోజుల తరువాత వచ్చారు. కొంతమందితో రహస్య భేటీలు నిర్వహించారు.మీడియాతో మాట్లాడారు. తిరిగి హైద్రాబాద్ వెళ్లారు. నియోజక వర్గంలో జరుగుతున్నా పరిణామాలపై ఎప్పటికప్పుడు తన అభిమానుల ద్వారా నిరంతరం తెలుసుకుంటున్నారు. ఒక్కడిగా ఉన్న ఈటల అధికారంలో ఉన్న పార్టీని తట్టుకుకొని నిలబడ గలరా ? లేదా ?అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ను కలిశారు. అనంతరం టీఆర్ యస్ అసమ్మతి రాజ్యసభ సభ్యుడు డి .శ్రీనివాస్ ను కలిశారు. అక్కడే ఉన్న బీజేపీ ఎంపీ అరవింద్ ను కలిశారు. అంతకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి కేసీఆర్ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటలను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మొత్తమీద ఈటల వార్తలలో వ్యక్తిగా నిలిచారు.ప్రస్తుతం క్రాస్ రోడ్ లో ఉన్న ఈటల ఏ దారిన వెళ్లాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? లేదా ? అనే విషయంపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో తిరిగి ఈటల గెలుస్తాడా ? లేదా ? అనేది కూడా చర్చనీయాంశం అయింది. గెలిస్తే తిరుగుండదు. గెలవకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే టీఆర్ యస్ బాస్ హుజురాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.హరీష్ రావు కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అక్కడ ఈటల క్యాంపు ను బలహీన పరచడం తక్షణ కర్తవ్యమ్ గా పెట్టుకున్నారు.

 

Related posts

పంజాబ్​లో ఆప్​ సర్కారుకు షాకిచ్చిన గవర్నర్​..

Drukpadam

ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు!

Drukpadam

రేవంత్ స్ట్రాటజీ …మెత్తబడుతున్న నేతలు …విహెచ్ గీతోపదేశం

Drukpadam

Leave a Comment