Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ ఆపరేషన్ నేరుగా రంగంలోకి దిగిన హరీష్ రావు!

హుజురాబాద్ ఆపరేషన్ నేరుగా రంగంలోకి దిగిన హరీష్ రావు!
-రిటైర్డ్ అధికారి దొంత రమేష్ ను పిలిపించుకున్న హరీష్ రావు
-మంత్రి హరీష్ రావు తో దొంత రమేష్ సుదీర్ఘ మంతనాలు
-నియోజవర్గ పరిస్థితులపై ఆరా
-పెండింగ్ పనుల గుర్తింపు

హుజురాబాద్ ఆపరేషన్ లో ఇప్పటివరకు తెరవెనక ఉండి కథనడిపించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. తన ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్ హురాబాద్ నేతలతో వ్యవహరించారు.అయితే ఆయన చాలామంది స్థానిక నాయకులతో మాట్లాడి పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని హితబోధ చేశారు. కొందరు ఆయన దగ్గర సరేనన్న బయటికి వచ్చి మొఖం విరుస్తున్నారు. ఏనాడూ తమ గురించి పట్టించుకోని నేతలు పిలిచి టైం ఇచ్చి మాట్లుడుతున్నారని అంటున్నారు. గంగుల కమలాకర్ తో సరిపోదని తెలుసుకున్న హరీష్ రావు నేరుగా రంగం లోకి దిగటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. హరీష్ రావు అంటే తెలంగాణ యువత లో ఒక ఇన్స్పిరేషన్ ఉండటంతో ఆయన మాటకు విలువ ఉంది. కేసీఆర్ తరువాత అంత పాపులారిటీ ఉన్న నాయకుడు ఆయనే అనే అభిప్రాయాలు ఉన్నాయి. హుజురాబాద్ ఆపరేషన్ లో హరీష్ ను ఉపయోగించటంలో మరో కారణం ఉండనే అభిప్రాయాలు ఉన్నాయి . ఈటల రాజేందర్, హరీష్ రావు అత్యంత సన్నిహితులు అనే పేరుంది.అందువల్ల ఈటల ను బలహీన పరిచేందికు హరీష్ ను ఉపయోగించాలని నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి.
మంత్రి తన్నీరు హరీష్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేటలోని హరీష్ రావు గారి నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రభుత్వ మాజీ అనుసంధాన అధికారి తెరాస రాష్ట్ర నాయకులు దొంత రమేష్ హరీష్ రావు తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో తాజా రాజకీయ, కార్యకర్తల అభిప్రాయాలు మరియు వివిధ అభివృద్ధి, పెండింగ్ పనుల గురించి మంత్రి హరీష్ రావు గారు అడిగి తెలుసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేయాలని సూచించారు ఈ సందర్భంగా దొంత రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృధి పనులు త్వరగా పూర్తి చేయాలని మరియు నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపై మంత్రికి వివరించి నివేదిక అందించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సందమల్ల బాబు, దొమ్మటి వెంకన్న , దుబాసి బాబు, ముక్క శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో 59 శాతం మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసులు..: ఏడీఆర్ రిపోర్ట్

Drukpadam

గంగావతి నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థిగా గాలి జనార్దన్‌రెడ్డి….

Drukpadam

పశ్చిమ బెంగాల్ బీజేపీలో లుకలుకలు..

Drukpadam

Leave a Comment