Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం లో నకిలీ రెమెడిసివిర్ ఇంజక్షన్ కలకలం…

ఖమ్మం లో నకిలీ రెమెడిసివిర్ ఇంజక్షన్ కలకలం…
-పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
-తనతండ్రి మరణానికి హాస్పిటల్ యాజమాన్యమే కారణమంటున్న కుమారుడు
-మోదుల భద్రయ్య కు ఇచ్చిన ఇంజక్షన్ నకిలీదే
-తెలిచిన డగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్

ఖమ్మం లో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని అనడానికి మరో ఉదాహరణ గా మోదుల భద్రయ్యకు ఇచ్చిన ఇంజక్షన్ సాక్షి భూతంగా నిలిచింది. ఎలాంటివి ఎన్నో మరెన్నో ఖమ్మం లో దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు నెట్టి నోరు మొత్తుకుంటున్నారు. కొందరి చెప్పుకోలేక పోతున్నారు.ట్రీట్ మెంట్ దగ్గరనుంచి అన్ని మోసాలే జరుగుతున్నాయని పలువురు వాపోతున్నారు . కరోనా వచ్చిన ఒక పేషంట్ కు ఇవ్వాల్సిన రెమిడీ సివియర్ ఇంజక్షన్ నకిలీది ఇచ్చి ఆయన ప్రాణం తీశారని ఆయన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించారు. అందులో భద్రయ్య కు ఇచ్చిన ఇంజక్షన్ నకిలీదని నిర్దారణ అయింది.
నకిలీ రెమెడిసివిర్ ఇంజక్షన్ ఎక్కించడం వల్లనే నా తండ్రి మోదల భద్రయ్య మృతికి కారణమని కుమారుడు మోదల సందీప్ శ్రీ బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం పైన
ఖమ్మం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ది.18 05.2021 న ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నెం.255/2021 U/Sec. 420,276,304(ii) R/w 120(B), 109 IPC కింద కేసు నమోదు చేసిన్నట్లు టౌన్ ఏసీపీ అంజనేయులు తెలిపారు.

పోలీస్ ,టాస్క్ ఫోర్స్ , మెడికల్ &హెల్త్ ,డ్రగ్ కంట్రోల్ అధికారులతో కూడిన
హైపవర్ కమిటీ ఆధ్వర్యంలో లోతుగా విచారణ జరపడం జరిగిందని టౌన్ ఏసీపీ తెలిపారు.

ఈ దర్యాప్తులో పిర్యాదుదారుడు కొనుగోలు చేసిన రెమెడిసివిర్ ఇంజక్షన్ లు రెండింటిని (ఖాళీ వాటిని ) సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్ (హైపవర్ కమిటీ సభ్యుడు)కు రిక్విజిషన్ ద్వారా పంపగా ఆయన పరిశీలించి అవి నకిలీవని నిర్ధారించి ధృవపత్రం ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రెండు నకిలీ ఇంజక్షన్లను శ్రీ బాలాజీ హాస్పిటల్ వారు ఫిర్యాదుదారునికి రూ.60,000/ -లకు తేది.28.04.2021 న అమ్మడం జరిగిందని నిందుతులు నేరాన్ని ఒప్పుకొన్న నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 19.05.21 న ఈ కేసులో నిందుతులైన శ్రీ బాలాజీ హాస్పిటల్ 1. డాక్టర్ జి. శ్యామ్ కుమార్ 2. లింగన బోయిన రాంబాబు (మెడికల్ రిప్రజెంటేటివ్) 3. నల్లగట్ల నవీన్ కుమార్ (కంపౌండర్) ను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

 

Related posts

ప్రభుత్వ ఉపాధ్యాయుడు 23 కాలేజీలకు యజమాని… ఆస్తులు చూసి అవాక్కైన అధికారులు!

Drukpadam

వాట్సాప్ యూజర్ల డేటా చోరీ చేయడానికి హ్యాకర్ల కొత్త ఎత్తుగడ

Ram Narayana

పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్

Drukpadam

Leave a Comment