Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నం ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవు

ఆనందయ్యఇచ్చేదిఅయిర్వేదంకాదు.

ఆయుష్ కమీషనర్ రాములు

 

ఆయుష్ ప్రతినిధుల సమక్షం లో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు.

ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం కాదు.

మందు తయారీ లో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ నిర్ధారించినట్లు కమీషనర్ రాములు తెలిపారు.భొణిగి ఆనందయ్య ఇచ్చేమందులో ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.అయితే ఆ మందు ఆయుర్వేదం కాదని నాటు మందని అన్నారు.ఆనందయ్యమందునాటుమందుగానేపరిగణిస్తాం మని అన్నారు. కళ్ళలో వేసేడ్రాప్స్ కూడ సాధారణ పదార్ధాలే వాడుతున్నారని అందువల్ల ఈ మందు హానికరం కాదని నిర్ణయానికి వచ్చామన్నారు.

మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ- తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది.

CCRAS ( సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది.

అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుంది.

రోగుల లో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది.

పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.

మందు తయారీపై ఆయుష్ పరిశీలన ముగిసింది.

ఆనందయ్య కరోనా మందుపై లోకాయుక్త విచారణ

  • Lokayuktha will conduct hearing on Anandaiah ayurvedic medicine
  • ఆనందయ్య మందుపై ప్రభుత్వం చర్యలు
  • వివరాలు సేకరిస్తున్న ఆయుష్ అధికారులు
  • ఈ నెల 31న లోకాయుక్త విచారణ
  • నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు
 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై నిగ్గు తేల్చేందుకు ఆయుష్ వర్గాలు రంగంలోకి దిగాయి. మందుపై శాస్త్రీయ అధ్యయనం జరిగాకే పంపిణీ అంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, లోకాయుక్త కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఆనందయ్య కరోనా మందుపై ఈ నెల 31న విచారణ జరపనుంది. దీనికి హాజరు కావాలని నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించకూడదని లోకాయుక్త స్పష్టం చేసింది.

అటు, కృష్ణపట్నంలో పర్యటిస్తున్న ఆయుష్ అధికారులు ఆనందయ్య నుంచి మందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని ఆనందయ్య అధికారులకు వివరించారు. వివిధ పరీక్షల్లో ఆనందయ్య ఆయుర్వేద మందుపై సానుకూల ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆనందయ్యకు పూర్తిస్థాయిలో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

భద్రాద్రి మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం -పులకించిన భక్త జనం!

Drukpadam

యూట్యూబ్ న్యూస్ చానెళ్లకు చెక్ పెట్టె దిశగా చర్యలు…

Drukpadam

Drukpadam

Leave a Comment