Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి…

కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాల అసంతృప్తి
-వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలకు జరుగుతున్నా అన్యాలపై లేఖలు
-ఆక్సిజన్ విషయంలోనూ సమన్వయలోపం
-మందుల పంపిణీలోనూ అదే తీరు
-ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది
-ప్రధానికి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
-ఏపీలో వ్యాక్సిన్ కొరత ఉందన్న జగన్
-45 ఏళ్లకు పైబడిన వారికే ఇస్తున్నామని వెల్లడి
-ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదన్న సీఎం
-ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వివరణ
-వ్యాక్సిన్ కోసం కేంద్రానికి కీలక సూచనలు చేసిన కేజ్రీవాల్
-44 ఏళ్లలోపు వారికి కేంద్రం వ్యాక్సినేషన్ ను ఆపేసింది
-ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలి
-కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేసే అవకాశాన్ని అన్ని వ్యాక్సిన్ కంపెనీలకు ఇవ్వాలి

కరోనా కట్టడిలో కేంద్రం రాష్ట్రాల మధ్య ఎక్కడో తేడా కొడుతోంది. కేంద్రంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాక్సిన్ పంపిణీలోనూ , మందుల కేటాయింపులలోను , ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్ రూపంలో విజృంబిస్తున్నవేళ మోడీ ప్రభుత్వంపై ప్రత్యేకించి మోడీపై ఇంటబయట విమర్శలు ఎక్కువైయ్యాయి. బహుశా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతటి విమర్శలను ఎదుర్కొన్న సందర్భంలేదు. కేంద్రం
సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనపడుతుంది . అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రిలు దీనిపై కేంద్రానికి లేఖలు రాస్తున్న అక్కడనుంచి స్పందన అంతంత మంత్రంగానే ఉండనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానికి కరోనా వ్యాక్సిన్ , మందులు, ఆక్సిజన్ విషయంలో లేఖలు రాశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్ ప్రధానితో జరిగిన సమావేశంలో సరైన వివరణ రాకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనేక సందర్భాలలో తన గళం వినిపించారు. తిరిగి మూడవసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన మమతా బెనర్జీ ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్బాల్లో తనమాటలు పెడచెవిన పెట్టారని నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ ప్రధానికి లేఖరాశారు. మహారాష్ట్ర, పంజాబ్,రాజస్థాన్ , కేరళ , ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిలు సైతం తమ అసంతృప్తిని వివిధ సందర్బాలలో వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కేటాయింపు అనేది కేంద్రం చేతుల్లో ఉంది . మందులు ఆక్సిజన్ అన్ని కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం ఇదే తరహా వైఖరితో ఉన్నారు. ఆయన కూడా ప్రధానికి లేఖలు రాశారు. ముఖ్యమంత్రుల మాటలను విని కూడా పెడచెవిన పెట్టడంపై విమర్శలు ఉన్నాయి. ఇది ప్రధానికి తెలిసి జరుగుతుందా ? లేక తెలియక జరుగుతుందా ? అనేదానిపై సందేహాలు ఉన్నాయి. ఇదే వైఖరి కేంద్రం కొనసాగిస్తే కరోనా కట్టడిలో ఇబ్బందులు తప్పవని విశ్లేషకుల అంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించలేకపోయామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదని, ఈ చర్య తప్పుడు సంకేతాలు ఇస్తోందని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తున్నాయని, ఒక్కో వ్యాక్సిన్ డోసును రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నాయని ప్రధానికి తెలిపారు. వ్యాక్సిన్ పై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తారని ఆందోళన వెలిబుచ్చారు. దీనివల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు.

ఒకవైపు కొరత అంటున్నారు… మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు . వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అంశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని సూచించారు.

కేజ్రీవాల్ కేంద్రానికి సూచనలు

కరోనా వ్యాక్సిన్ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మండుటెండల్లో గంటల సేపు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు సూచనలు చేశారు.

వ్యాక్సిన్ కొరత వల్ల 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వాళ్లకు కేంద్రం వ్యాక్సినేషన్ ను నిలిపి వేసిందని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 44 ఏళ్లలోపు వారి కోసం ఇంతకు ముందు పంపిన వ్యాక్సిన్లను వారికే వాడాలని కేజ్రీ అన్నారు. ఆ డోసుల్లో ఏమైనా మిగిలితే… సాయంత్రం సమయంలో వాటిని ఇతరులకు వినియోగించాలని చెప్పారు. దీని గురించి కేంద్రానికి తాము ఇప్పటికే లేఖ కూడా రాశామని అన్నారు.

ఇప్పటి వరకు తాము 50 లక్షల డోసులు వేశామని… ఇంకా తమకు కనీసం 2.5 కోట్ల డోసులు కావాలని కేజ్రీ అన్నారు. ఇంకా ఎన్ని కరోనా వేవ్ లు వస్తాయోననే ఆందోళన తమకు ఉందని… ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాలో అనే భయాందోళనలను వ్యక్తం చేశారు.

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ టీకాను దేశంలోని అన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేయాలని కేజ్రీ సూచించారు. 24 గంటల్లో దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశీ వ్యాక్సిన్ తయారీదారులకు కూడా 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కేంద్రం తక్షణమే మాట్లాడాలని… వారి నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు, యూటీలు కొట్టుకుంటున్నాయని… దీనికి కేంద్రం ముగింపు పలకాలని కేజ్రీ కోరారు. కొన్ని దేశాలు వారికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లను సమకూర్చుకున్నాయని… వారి దగ్గరున్న మిగులు వ్యాక్సిన్లను మనకు పంపించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని చెప్పారు. భారత్ లో వ్యాక్సిన్ తయారుచేసేందుకు అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts

బీఆర్ యస్ అవినీతి పార్టీ దానితో యుద్ధమే … షర్మిల

Drukpadam

కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది: ఐఎంఏ

Drukpadam

2024 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుంది: ప్రశాంత్ కిశోర్

Drukpadam

Leave a Comment