Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ఓవరాక్షన్ -సీఎం క్షమాపణ

కరోనా లాక్ డౌన్ వేళ కొందరు అధికారులు, పోలీసుల అత్యుత్సాహం సాధారణ పౌరుల పాలిట శాపంగా మారింది. అత్యవసర పనులపై వెళుతోన్న సామాన్యులపై అక్కడక్కడా కొందరు అధికారులు, వారి మందీమార్బలం ఏకంగా దాడులకు దిగుతోన్నవైనం కలకలం రేపుతున్నది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోడానికి వెళుతోన్న ఓ యువకుడిని జిల్లా కలెక్టర్ కొట్టడం, బాధితుడి ఫోన్ పగలగొట్టడం, పోలీసులూ ఆ యువకుడిని బాదడం లాంటి దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర చర్యలకు ఆదేశించారు..

అధికారుల అత్యుత్సాహం..

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారడనే ఆరోపణలపై ఓ యువకుడి పట్ల ఆ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ అత్యుత్సాహం ప్రదర్శించాడు. కొవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకోడానికి వెళుతున్నానని ఎంతగా ప్రాదేయపడినా వినిపించుకోని ఆ కలెక్టర్.. యువకుడి ఫోన్ లాక్కొని నేలకొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. కలెక్టర్ చర్యతో పక్కనే ఉన్న పోలీసులు ఇంకాస్త రెచ్చిపోయి యువకుణ్ని లాఠీలతో బాదారు. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ అయింది. కలెక్టర్, పోలీసుల తీరును తప్పుపడుతూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో..

కలెక్టర్ చేసిన పనికి సీఎం క్షమాపణ

లాక్ డౌన్ లో బయటికొచ్చిన కారణంగా యువకుడి పట్ల సూరజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కలెక్టర్ శర్మ తీరు బ్రిటిష్ కాలాం నాటి తెల్లదొరల్లా అత్యంత నీచంగా ఉందని, యువకుడి ఫోన్ పగలగొట్టడం, చెంపమీద కొట్టడం అనాగరిక చర్య అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి సంజీవ్ గుప్తా మండిపడ్డారు. సూరజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ తీరుపై ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఛత్తీస్ ఘఢ్ లో ఇలాంటి వాటికి చోటు లేదు. యువకుణ్ని కొట్టినందుకు కలెక్టర్ తరఫున నేను సారీ చెబుతున్నాను. సదరు అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించాను” అని సీఎం వెల్లడించారు. కాగా,

అందుకే కోపం వచ్చి కొట్టాను.. సారీ..

లాక్ డౌన్ నిబంధనల అమలు పేరిట యువకుడి పట్ల దారుణంగా వ్యవహరించి, ఫోన్ విసిరికొట్టి, చెంపదెబ్బ కొట్టి చివరికి సస్పెండ్ అయిన సూరజ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ జరిగిన ఘటనపై మీడియాకు వివరణ ఇచ్చారు. ‘‘ఆ యువకుడి అనుచిత ప్రవర్తన నాకు కోపం తెప్పించింది. తొలుత వ్యాక్సిన్ తీసుకోడానికి బయటికి వచ్చానని చెప్పాడు. తర్వాత తన నానమ్మను చూడటానికి వెళుతున్నానన్నాడు. పత్రాలు చూపించమంటే మొబైల్ ఫోన్ లో చూపించలేదు. అతను మాట మార్చాడం వల్లే కోపంతో కొట్టాను. అలా చేసినందుకు నేనిప్పుడు సారీ చెబుతున్నాను” అని రణబీర్ శర్మ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ గా శర్మను తొలగించి, గౌరవ్ కుమార్ సింగ్ ను నియమించారు

Related posts

ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశం ఇదే!

Drukpadam

Build Muscle By Making This Simple Tweak to Your Training Program

Drukpadam

హనుమంతుడి జన్మస్థలంపై వివాదం…

Drukpadam

Leave a Comment