ఈటల బీజేపీ లో చేరికకు రంగం సిద్ధం …..ప్రత్యేక విమానంలో బీజేపీ నాయకుల రాక…
-బీజేపీ నేతలతో ఈటల ముమ్మరంగా చర్చలు
-ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,భూపేంద్రయాదవ్ రాక
– మొయినాబాద్ లోని వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ లో చర్చలు
-బీజేపీ నేత మాజీ ఎంపీ జీతందర్ రెడ్డి ,బండి సంజయ్ తో ఆదివారం ఈటల ఎడతెగని మంతనాలు
-హుటాహుటిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , భూపేందర్ యాదవ్ రాకతో ఊహాగానాలకు బలం
మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు రంగం సిద్దమైందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు . ఈటల గత రెండు ,మూడు రోజులుగా బీజేపీ నేతలతో వేడతెరిపిలేకుండా మంతనాలు జరుపుతున్నారు. ప్రధానంగా మాజీ ఎంపీ బీజేపీ కీలక నేత జితేందర్ రెడ్డి తో ఆదివారం , మంతనాలు జరిపారు. తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కూడా రహస్య భేటీ జరిపినట్లు సమాచారం. ఈటలతో ప్రత్యకంగా చర్చలు జరిపేందుకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు . బీజేపీ కేంద్ర నాయకులూ భూపేంద్ర యాదవ్ ప్రత్యేక విమానంలో హుటాహుటిన హైద్రాబాద్ చేరుకున్నారు. వారు నేరుగా మొయినాబాద్ లోని వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ లో ఈటలతో మంతనాలు జరుపున్నారని వార్తలు … ఈభేటీలో భూపేంద్ర యాదవ్ తో పాటు ,కిషన్ రెడ్డి ,జితేంద్ర రెడ్డి , డి కె అరుణ , ఒక మాజీ ఎంపీ , ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తుంది. ఈటల రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నందునే కేంద్రం నుంచి భూపేంద్ర యాదవ్ ను పంపినట్లు సమాచారం . అయితే బీజేపీ వర్గాలు మాత్రం దీని ద్రువీకరించటంలేదు.
టీఆర్ యస్ ఈటలను రాజకీయ చక్రబంధనంలో ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఆయన కూడా తన దారి తాను ఎటుకుంటున్నాడు . అనివార్యమైనా పరిస్థితులలో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం . భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించటమే కాకుండా ఆయన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంతో నియోజకవర్గంలో ఒంటరి చేయడమే కాకుండా ఉపఎన్నికలు వస్తే ఓడించడం ద్వారా టీఆర్ యస్ లో ఎదురు తిరిగితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిక చేయాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కు హుజురాబాద్ నియోజకవర్గ భాద్యతలు అప్పగించారు. పైగా ఈటల , హరీష్ రావు కు మంచి సంభందాలు ఉన్నందునే వారిమధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ తన రాజకీయచాణిక్యనీతి ప్రదర్శిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈటల పై భూకబ్జా కేసులతో పాటు , ఆయన కుమారుడు నితిన్ రెడ్డి పై అభియోగాలు మోపడంతో ఈటల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈటల ముందు ఉన్న మార్గాలు రెండు ….అందులో ఒకటి సొంతగా పార్టీ పెట్టడం , రెండు కాంగ్రెస్ ,లేదా బీజేపీ లో చేరడం అనేది. పార్టీ పెట్టడం కానీ పని ,రెండవది కాంగ్రెస్ కేంద్రం లో అధికారం లో లేదు . పైగా ఉన్న ఎమ్మెల్యేలనే రక్షించుకోలేని పరిస్థితి . ఈటలను రక్షించటం అనేది దుర్లభం . అందువల్ల ఈటల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీ లో చేరితేనే తనకు అండగా కేంద్రం ఉంటుందనే భరోసాతో బీజేపీ లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది.