సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్, పువ్వాడలకు కృతజ్ఞతలు
కేసీఆర్ కు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ప్రేమ …
పరిశ్రమను ఆదుకున్నందుకు ధన్యవాదాలు ఎంపీ రవిచంద్ర
గ్రానైట్ పరిశ్రమ కష్టకాలంలో స్పందించి వారికీ రావాల్సిన బకాయిలు అందించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చాటుకున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు ..పరిశ్రమ మనగడ ప్రశ్నర్ధకంగా ఉన్న సమయంలో బకాయిలు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు .ఇది ఏంటో మందికి ఉపయోగం అని అన్నారు . కేసీఆర్ కు ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ యజమానులు రుణపడి ఉన్నారని అన్నారు . తమ విజ్ఞప్తికి స్పందించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాల్సిన నైతిక భాద్యత గ్రానైట్ పరిశ్రమ యజమానులపై ఉందని అన్నారు .
గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం బకాయి ఉన్న పలు సబ్సిడీలను శనివారం విడుదల చేసింది. ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్, పవర్ సబ్సిడీ, పావలావడ్డీ బకాయిలు కలిపి.. ప్రభుత్వం రూ. 22 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి 2014 నుంచి పలు రకాల రాయితీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో పలు మార్లు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లకు విజ్ఞప్తులు అందించారు. ఈ ఏడాది జనవరి 18 న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ సందర్భంగా కూడా అసోసియేషన్ ప్రతినిధులను ఎంపీ రవిచంద్ర దగ్గరుండీ మంత్రి హరీష్ రావు ను కలిపించి.. సమస్య తీవ్రతను తెలియజేశారు. ఆనాడు హరీష్ రావు స్వయంగా బకాయిల విడుదలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు బకాయిల మొత్తంలో రూ. 22 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
కేసీఆర్ కు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ప్రేమ …
కేసీఆర్ కు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక ప్రేమ ఉందని గతంలో కూడా జిల్లాకు వేలాదికోట్ల ఖర్చు పెట్టి జిల్లా అభివృద్ధికి సహకరించారని అన్నారు . ఖమ్మం నగరంతోపాటు , భక్త రామదాసు ప్రాజక్టు , సీతారామ ప్రాజక్టు ల రూపకల్పనలు చేసి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు ..అందువల్లనే జిల్లాలో బీఆర్ యస్ కు ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని అన్నారు .
గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు రాయితీ బకాయిలు మంజూరు చేయడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు . ఖమ్మం గ్రానైట్ కుటుంబ సభ్యులందరూ సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటారని అన్నారు. తెలంగాణలో అతి ముఖ్యమైన గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని కోరిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లు కూడా పరిశ్రమను ఆదుకోవడంలో అండగా నిలిచారని.. వారితో పాటు సహకరించిన జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలకు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు.