Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కమ్యూనిస్టులకు పరాభవం …రగిలిపోతున్న కామ్రేడ్స్…!

కమ్యూనిస్టులకు పరాభవం …వారి ప్రతిపాదనలు పట్టించుకోని కేసీఆర్
పొత్తుల ఎత్తుల్లో లెఫ్ట్ పార్టీల చిత్తు … రగిలిపోతున్న కామ్రేడ్స్
పొత్తు పొత్తు అంటూనే కేసీఆర్ నమ్మించి గొంతుకోశాడనే అభిప్రాయం
తమ తడాకా చుపిస్తామంటున్న ఎర్రదండు
తమకు పట్టున్న నియోజకవర్గాల్లో ప్రతీకారం తీర్చుకుంటామంటున్న కార్యకర్హలు
బీఆర్ యస్ వైఖరిపై రేపు హైద్రాబాద్ లో లెఫ్ట్ పార్టీల సమావేశం…

బీఆర్ యస్ అధినేత ,సీఎం కేసీఆర్ చర్యలవల్ల కమ్యూనిస్టులు పరాభవానికి గురైయ్యారు ..మునుగోడు ఎన్నికల్లో సహకారం కోసం తమ చుట్టూ తిరిగి సహాయం తీసుకోని అక్కడ గెలుపొంది భవిష్యత్ లో కూడా కలిసి పనిచేద్దామని, ఎన్నికల్లో పొత్తు కొనసాగిద్దామని తియ్యటి మాటలు చెప్పిన కేసీఆర్ తమను నమ్మించి గొంతు కోశాడని లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు అంటున్నారు . ఎన్నికల్లో కల్సి పోటీచేద్దామని చెప్పి అందుకు విరుద్ధంగా వ్యహరించడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు .. కేసీఆర్ తో కల్సి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా చూద్దాం చేద్దాం అంటూ దాటవేత వైఖరి అవలంబించి అవమానించడంపై తట్టుకోలేక పోతున్నారు . చివరకు తమను సంప్రదించకుండానే ఏక పక్షంగా అభ్యర్థులను ప్రకటించడం అంటే తమను పట్ల ఆయన వైఖరి ఏమిటో అర్ధం అవుతుందని ఇక తమకు బీఆర్ యస్ మధ్య జరగబోయే యుద్దాన్ని చూడాల్సిందేనని … కేసీఆర్ చర్యలపై రగిలి పోతున్నారు . కేసీఆర్ మీద తమకు ఏర్పడిన అభిప్రాయాన్ని అభ్యర్థుల ప్రకటనతో పటాపంచలు అయిందని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . మిత్రధర్మం అంటే ఇదేనా …? తమకు అవసరం వచ్చినప్పడు ఒకలా , పొత్తుల మాట వచ్చే వరకు మరోలా వ్యవహరించడం కేసీఆర్ కే చెల్లిందని వాపోతున్నారు .బీఆర్ యస్ ,బీజేపీ వ్యతిరేకంగా నిలిచిందని ఉద్దేశంతో మునుగోడులో మద్దతు ఇచ్చామని లెఫ్ట్ లేకపోతె బీఆర్ యస్ ఓడిపోయేదని బీఆర్ యస్ మంత్రులు ,నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు .

కేసీఆర్ ప్రభుత్వంపై ఇక యుద్ధమే …

కేసీఆర్ ప్రభుత్వం పై ఇక యుద్ధం తప్పదని ఇక తమ సత్తా చూపుతామని లెఫ్ట్ నేతలు హెచ్చరికలు జారీచేస్తున్నారు . బీఆర్ యస్ కొన్ని సంక్షమే పథకాలు ప్రవేశ పెట్టిన పేదల , కార్మికుల , ఉద్యోగుల , ఉపాధ్యాయుల ,సమస్యల పరిష్కరంలో చెపుతున్న మాటలకూ చేస్తున్న చేతలకు సంబంధం లేకుండా ఉందని అంటున్నారు . తాము అనేక విషయాల్లో అధికార బీఆర్ యస్ తో విభేదిస్తున్న విషయాన్నీ పేర్కొంటున్నారు .

ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ జిల్లాలపై కమ్యూనిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ..

ఇక కమ్యూనిస్టులతో పొత్తుకు బీఆర్ యస్ అధినేత కేసీఆర్ కటీఫ్ చెప్పడంతో ఈ ప్రభావం ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ జిల్లాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని బీఆర్ యస్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు .ఈ రెండు జిల్లాల్లో 22 నియోజకవర్గాలతోపాటు , రాష్ట్రంలోని మరో 15 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి ఉంటుందని అందువల్ల బీఆర్ యస్ పెద్ద నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు ….

Related posts

కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు… బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల

Ram Narayana

 బీజేపీ ‘ఇంద్రధనుస్సు’ మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలు… ఉచిత విద్య, వైద్యం కూడా

Ram Narayana

కామారెడ్డి నుంచే పోటీ చేస్తా.. ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana

Leave a Comment