Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

డొమినికా పోలీసుల అదుపులో మెహుల్ చోక్సీ.. అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు
  • అంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ
  • ఈ నెల 25న అంటిగ్వా నుంచి పరార్
  • అటునుంచి అటే భారత్‌కు పంపించాలన్న అంటిగ్వా ప్రధాని

అంటిగ్వా నుంచి పరారైన భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ చోక్సీ డొమినికా పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న అంటిగ్వాలో ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత మాయమయ్యాడు. అతడి కోసం అంటిగ్వా పోలీసులు గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు, చోక్సీ దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదని ఆ దేశ ప్రధాని కూడా చెప్పారు. అయితే, తాజాగా చోక్సీ డొమినికా పోలీసులకు చిక్కినట్టు అక్కడి మీడియా తెలిపింది. అతడిని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా, చోక్సీ సముద్రమార్గం ద్వారా అక్రమంగా డొమినికాకు వెళ్లి ఉండొచ్చని అంటిగ్వా ప్రధాని తెలిపారు. చోక్సీని నిర్బంధించి అటు నుంచి అటే అతడిని భారత్‌కు తరలించాలని అంటిగ్వా ప్రధాని డొమినికాను కోరారు.

Related posts

సైబర్ క్రైమ్ 3 నిమిషాల వ్యవధిలో కోటి 10 లక్షలు డ్రా …అప్రమత్తమైన కస్టమర్

Ram Narayana

ప్రభుత్వ అధికారి నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈడీ అధికారి

Ram Narayana

నాగోలు ఫ్లై ఓవర్‌పై బీభత్సం సృష్టించిన ట్యాంకర్ .. కార్లు, బైకుల ధ్వంసం!

Drukpadam

Leave a Comment