Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తన అరెస్ట్ పై సవాల్ విసిరిన యోగాగురువు :బాబా రాందేవ్!

తన అరెస్ట్ పై సవాల్ విసిరిన యోగాగురువు :బాబా రాందేవ్!
నన్ను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు
అల్లోపతి వైద్యంపై తీవ్ర విమర్శలు చేసిన రాందేవ్ బాబా
రాందేవ్ పై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన ఐఎంఏ
అయినా ఏ మాత్రం తగ్గని బాబా రాందేవ్
అల్లోపతి వైద్యంపై వివాద స్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు ఐ ఎం ఏ కు మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం లో రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసు నమోదు చేయాలనీ ,అరెస్ట్ చేయాలనీ ఐ ఎం ఏ ప్రధానికి లేఖరాయడం పై మంది పడ్డారు. తనను అరెస్ట్ చేసే దమ్ము ఉందా? సవాల్ విసిరారు . తనపై ఎన్ని విమర్శలు చేసినా తన అభిప్రాయాలూ చెప్పటంలో వెనక్కు తగ్గేది లేదని అంటున్నారు.
అల్లోపతి మందుల (ఇంగ్లీష్ మందులు) గురించి ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రాచీన కాలం నుంచి మన ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని… అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని… దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే ఇది జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై… ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ పై దేశద్రోహం కేసులు పెట్టాలని వ్యాఖ్యానించింది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఆయన అన్నారు. ఈ మేరకు పరోక్షంగా మోదీ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. వాళ్ల బాబులు కూడా తనను అరెస్ట్ చేయలేరని అన్నారు. రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో భయాలను కలిగించేలా రాందేవ్ వ్యవహరిస్తున్నారని మోదీకి రాసిన లేఖలో ఐఎంఏ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత కూడా దేశంలోని 10 వేల మంది డాక్టర్లు మరణించారంటూ రెండు వీడియోల్లో బాబా రాందేవ్ ఆరోపించారని చెప్పింది. పతంజలి సంస్థ అధినేత రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. కరోనా ఫస్ట్ వేవ్ లో 753 డాక్టర్లు, సెకండ్ వేవ్ లో 513 మంది వైద్యులు చనిపోయారని.. వీరెవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఘాటుగా స్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు .

Related posts

విశాఖ లో మత్తు ఇంజెక్షన్ లా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు!

Drukpadam

యూపీలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం…

Drukpadam

మోదీని చంపేందుకు సిద్ధం కావాలన్న కాంగ్రెస్ నేత అరెస్ట్!

Drukpadam

Leave a Comment