Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు… సీఎం జగన్…

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు… సీఎం జగన్…
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయలో సీఎం సమీక్ష
  • అత్యుత్తమ ప్రమాణాలతో విద్యపై చర్చ
  • నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య
  • పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ప్రీప్రైమరీ స్కూళ్లు

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఇవాళ ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. ఆ విధమైన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినవే వైఎస్సార్ ప్రీప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు అని వివరించారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని, ఇప్పుడు వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో విద్యాప్రమాణాలను మరింత ఉన్నతీకరిస్తామని అన్నారు.

చిన్నారుల్లో 6 ఏళ్ల లోపే 80 శాతం మేధో వికాసం కలుగుతుందని, ఆ వయసులోని నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ఉండాలని, అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related posts

Drukpadam

శ్రీశైలంలో యాంఫీ థియేటర్ నిర్మాణంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి! 

Drukpadam

ఒకప్పుడు ఆఫ్ఘన్​ మంత్రి.. ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్​!

Drukpadam

Leave a Comment