Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలను ప్రోత్సాహస్తుంది:సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్!

కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలను ప్రోత్సాహస్తుంది:సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్

-ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చెక్కు లు పంపిణీ.

-దాడులకు పాల్పడితే సహించేది లేదు :-

కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయాలకు ప్రొత్సహిస్తుందని,అందుకే రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చిందని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి,టీఆర్ఎస్ కార్పొరేటర్ మాజీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ పగడాల నాగరాజు లు అన్నారు.గురువారం నగరంలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 21 వ తేదీ న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో వివిధ డివిజన్ లో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన్నట్ల తెలిపారు.21/5/21 ఉదయం 7:30 గంటలకు 57 వ డివిజన్ లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బాధితులకు ఇంటి వద్ద చెక్కులు ఇచ్చేందుకు వెళ్లామని తెలిపారు.అక్కడ కార్పొరేటర్ భర్త ముస్తఫా అనే రౌడీ షీటర్ కొంత మంది యువకులతో వచ్చి దాడికి పాల్పడిన్నట్లు తెలిపారు.దాడుల సంస్కృతి ఖమ్మం నగరంలో సృష్టించడం సరైంది కాదన్నారు,కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేర చరిత్ర కలిగిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్లనే ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో రౌడీ మూకలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అడ్డుపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చెస్తున్న వారిని ప్రజలు క్షమించరని తెలిపారు.57వ డివిజన్ లో ప్రజల సమస్యలు ఉంటే కార్పొరేటర్, మంత్రి దృష్టి కి తీసుకొచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి,యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య,మైనారిటీ నాయకులు తాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం :13 జిల్లాల జడ్పీ ల కైవశం అదే రీతిలో ఎంపీపీ లు!

Drukpadam

ఖమ్మంలో జరగనున్న బీఆర్ యస్ సభ పై రేణుక చౌదరి సైటైర్లు!

Drukpadam

చార్మినార్ లో ముస్లింల ప్రార్థనలను అనుమతించాలి.. స్థానిక కాంగ్రెస్ నేత డిమాండ్!

Drukpadam

Leave a Comment