Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ హైకోర్టులో ఈటల కుటుంబసభ్యులకు చుక్కెదురు

  • ఈటలపై భూఆక్రమణల ఆరోపణలు
  • మంత్రి పదవి కోల్పోయిన ఈటల
  • జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే
  • నిలుపుదల చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఈటల అర్ధాంగి

ఇటీవల ఈటల రాజేందర్ కు చెందిన భూముల్లో ప్రభుత్వం సర్వేకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అసైన్డ్ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఈటల పదవీచ్యుతుడయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ (మెదక్ జిల్లా మాసాయిపేట మండలం) భూముల సర్వే కొనసాగుతోంది. దీనిపై ఈటల రాజేందర్ అర్ధాంగి జమున హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నిలుపుదల చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్వే నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

కాగా, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొన్నిరోజుల పాటు భూ సర్వే వాయిదా వేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఏజీ తెలిపారు. వాదనల అనంతరం స్టే నిరాకరించిన న్యాయస్థానం… జూన్ రెండవ, లేదా, మూడవ వారంలో సర్వే చేయాలని మాసాయిపేట మండల రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

Related posts

ఎట్టకేలకు తెలంగాణలోని వర్సిటీలకు నూతన వీసీలు!

Drukpadam

అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్’ మాత్రమే..ష‌ర్మిల‌

Ram Narayana

ఒక్క‌ తీర్మానమూ లేదు.. ర‌ష్యా, ఉక్రెయిన్ చ‌ర్చ‌లు విఫలం!

Drukpadam

Leave a Comment