Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు: కేంద్రం!

రెండు వేరు వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు: కేంద్రం!
-వ్యాక్సిన్లు మారినా ప్రతికూల ప్రభావం లేదని వెల్లడి
-యూపీలో 20 మందికి వేర్వేరు డోసులు
-అయితే కేంద్రం మార్గదర్శనాలు మాత్రం ఒకటే ఇవ్వాలని
-వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్ర విమర్శలు
-చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
-వేర్వేరు డోసుల వల్ల ప్రమాదం ఉండబోదన్న నీతి ఆయోగ్ సభ్యుడు వి కే పాల్
రెండు వేరువేరు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది .యూ పీ లో 20 మందికి వేరువేరు డోసులు ఇవ్వడం పై తీవ్ర విమర్శలు వెల్లు ఎత్తాయి .దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి వచ్చింది . కానీ కేంద్రం మోడీ డోస్ ఏది తీసుకుంటే రెండవ డోసు కూడా తీసుకోవాలని మార్గదర్శకాలు స్పష్టం చేసింది. అయితే అందుకు ఇరుద్దంగా రెండవడోసు వేరే వ్యాక్సిన్ ఇవ్వడంపై దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది .
తొలి డోసుగా కొవిషీల్డ్, రెండో డోసుగా కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల 20 మందికి ఇలా వేర్వేరు డోసులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. తాజాగా, ఈ విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. రెండు వేర్వేరు డోసులు తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవన్నారు.

నిజానికి మొదటి డోసు ఏ వ్యాక్సిన్ వేసుకుంటే రెండో డోసు కూడా అదే వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయన్నారు. అయితే, రెండో డోసు ఏదైనప్పటికీ ప్రతికూల ప్రభావం మాత్రం ఉండబోదని తాను చెప్పగలనన్నారు. రెండో డోసు వేసుకోవడం ద్వారా రోగ నిరోధకశక్తి మరింత బలోపేతమవుతుందన్నారు. తొలి డోసు ఏది ఇచ్చారో మలి డోసు కూడా అదే ఇచ్చేలా చూడాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనపై విచారణ జరపాల్సిందేనని పాల్ పేర్కొన్నారు.

Related posts

టీకా తీసుకున్న వారిలో మరణించింది ఒక్కరేనట.. స్పష్టం చేసిన కేంద్రం…

Drukpadam

మాస్క్ అవసరం లేని దేశంగా ఇజ్రాయిల్

Drukpadam

ప్రపంచవ్యాప్తంగా వివిధ కరోనా టీకాల ధరలు ఇలా ఉన్నాయి!

Drukpadam

Leave a Comment